సీతారామయ్య గారు ఎక్కడకు వెళ్ళినా దాదాపు నడిచే ప్రయాణం చేస్తారు. ఎలాంటి ఆడంబరాలు ఆయనకు నచ్చవు వారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తూ చాలా రోజులు మాకు ఆత్మీయతను పంచిన వారు. నిజానికి యోగి. నా శ్రీమతి అరుణ వారు వచ్చిన ప్రతిసారి తన తండ్రి వచ్చి తన ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్ళాడు అని ఎంత ఆనందిస్తుందో చెప్పలేం ఆయనలో ఆ పితృవాత్సల్యం అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది అసలు గుమ్మంలోకి రాగానే వారి పిలుపు అమ్మా అరుణా అన్న ఆ పిలుపు వినగానే ఆమెకు పంచప్రాణాలు లేచి వస్తాయి రాగానే మంచినీళ్లు ఇవ్వడం దగ్గర వుండి భోజనం చేసి వెళ్లేంతవరకు సకల సదుపాయాలు చేయడం ఆమెకు అలవాటు వారు కూడా తన కన్న బిడ్డను ఎలా చూసుకుంటారో అంతకుమించిన ఆదరణ వారి కళ్ళలో కనిపిస్తుంది వారి జీవితంలో ఏ ఒక్కరిని కించపరిచే మాట తన నోటి నుంచి వచ్చిన దాఖలాలు లేవు. వారు చెప్పే మాటల్లో ఎక్కువగా మహాత్మా గాంధీని గురించి వారి ఆశయాలు వారి జీవితం వారి తత్వాన్ని గురించే రెండవ వారు ఆయన అమితంగా ప్రేమించే కాకాని వెంకటరత్నం గారు.
వారి పేరే కంచు కాకాని ఏదైనా ఒక కార్యక్రమం చేయ తలపెట్టినప్పుడు దానిని పూర్తిచేసేంతవరకు వారికి నిద్ర పట్టదు తాను ఆ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ప్రక్క సహకరిస్తున్న వారందరికీ కావలసిన ఏర్పాట్లు చేస్తూ రకరకాల ఉదాహరణలతో వారిని ఉత్తేజపరుస్తూ నవ్విస్తూనే ఉంటారు. ఆ రోజుల్లో వారి కారు ప్రత్యేక ఆకర్షణ దానిని చూడగానే కాకాని వారు వస్తున్నారు అని తెలిసిపోతుంది కాకాని వారితో పాటు ఎవరు ఉంటారో కూడా ఊహించగలం. ఒకరు సీతారామయ్యగారైతే మరొకరు కలపాల సూర్యప్రకాశరావు గారు వారిద్దరూ కాకానికి రెండు భుజాల లాంటివాడు వారిద్దరికీ ఏ పని అప్పచెప్పినా ఆయన తిరిగి చూసుకోరు కాకాని వారు ఏది చెబితే దానిని ప్రతి అక్షరం తప్పకుండా చేస్తారు. వారు చేసిన ప్రతి పని కాకాని వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది అలాంటి స్నేహశీలి. సీతారామయ్య గారు అధికంగా మాట్లాడడం ఎవరు వినలేదు అనవసరమైన ఏ వాక్యము ఆయన పలకరు ఎదుటివారు పలికినా దానిని ఆపే ప్రయత్నం చేస్తారు తప్ప వేరే మాటలు ఉండవు చెడు ఆలోచించకు చెడు వినకు చెడు అనకు అని పెద్దలు చెప్పిన సూక్తిని మనసా వాచా కర్మణా అనుసరించేవారు అరుణ తో మాత్రం ఎన్ని కబుర్లు చెప్తారో చెప్పలేం అన్నిట్లోనూ ఆయన సొంతగా పాల్గొని చేసిన కార్యక్రమం తప్పా వేరే ఉండదు వారిని గురించి వారు చెప్పుకోవడం వారికి నచ్చదు వారి భాష కూడా చాలా సరళంగా ఉంటుంది విజయవాడలో స్వాతంత్ర్య సమరయోధుల పిల్లల కోసం ఒక భవనాన్ని కట్టాలన్న ఆలోచన చేసి మా భాస్కర్ తో సంప్రదించి దానికి సంబంధించిన చక్కటి హాలును ఆపైన నివాసం ఉండడానికి చక్కటి ఏర్పాట్లతో వారి సొంత ఖర్చుతో ఏర్పాటు చేశారు అది వారి ఔదార్యం. సహజ సిద్ధంగా ప్రజాసేవ చేయాలన్న కోరిక తన వయసులో ఉన్నవారు తనకన్నా పెద్దవారు ఎవరు ఉంటే వారిని తప్పకుండా గౌరవించే తత్వం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి