గౌరారం గ్రామంలో రాజు, కౌశిక్, చరణ్ అనే ముగ్గురు స్నేహితులు ఉండేవారు. ఒకరోజు వారు వాళ్ల ఊరు నుంచి పట్టణానికివెళ్లడానికి ఒక అడవి గుండా పోతున్నారు. చరణ్ కు బాగా దాహం వేసింది. తన స్నేహితుడి దాహం తీర్చడానికి నీళ్ల కోసం వెతకడానికి రాజు అడవి లోపలికి వెళ్ళాడు. కొద్ది దూరంలో వాగు ప్రవహిస్తున్న నీటి శబ్దం వినిపించింది. రాజు అక్కడికి వెళ్ళాడు. నీళ్లను చూసిన సంతోషం లో చుట్టుపక్కల ఏం జరుగుతుందో పట్టించుకోలేదు.అప్పుడే ఒక్కొక్క పెద్ద కొండచిలువ రాజును చుట్టేసింది. భయంతో రాజు కేకలు వేశాడు. ఏం జరిగిందో అని ఇద్దరు స్నేహితులు అటువైపు పరిగెత్తారు. కొండచిలువ రాజును చుట్టి వేయడం చూసి చరణ్ కౌశిక్ ఎంతో భయపడ్డారు. కౌశిక్ వెంటనే ఉపాయాన్ని ఆలోచించాడు. రాయి తీసుకొని కొండచిలువ తలపై బలంగా కొట్టాడు. అంతటితో కొండచిలువ గిలగిలా కొట్టుకుంటూ కిందపడింది. రాజు ప్రాణాలతో బయటపడ్డాడు. సాహసంతో తన స్నేహితుడిని రక్షించుకున్నారు ఇద్దరు స్నేహితులు. తనకోసం ప్రాణాలకు తెగించి కాపాడిన స్నేహితులకు రాజు కృతజ్ఞతలు చెప్పాడు.
నీతి: ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు.
నీతి: ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి