అవనిలో ఆశల సౌరభాలు ఆస్వాదించ
మనసు దిగ్దిగింతాల విదజిల్లు భావనల
తోడ,
భావమధురిమలు తేనెఝరులై
ప్రవహించ మానసంబుప్పొంగ,
మధురతరహేల వెనువెంటనే విన్పించ
సుగమ కుహూ కుహూల ఏమీ సంగీత
మాధురీఝరులు,సృతిలయల మిళిత
మృదంగ విన్యాసాలు,
. ప్రకృతి పులకించె,తన సంగీత హేల
మధురతర సృష్టి మహినీ,
మురిపించు, ఆలపించు ప్రతి హృది
అనుభవింప, అమృత గాన సంగీత
విభావరీ, ఆ భగవంతుని సృష్టిలో
పారవశ్యం చెందె సరళముగ!!
ఏమి సంతోషహేల ?
అనంత సంప్రోక్షణల తేలె
మదిని ఆశ వోలె!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి