ప్రభంజనం;- కొప్పరపు తాయారు--సెల్ ; 9440460797
         ఆశగా నిన్ను చూస్తుంటే అలా 
          ఆ పరుగులు ఏమిటి
          కరుణ ఉందని దరికి వస్తే
           దారి లేదంటావేమి?

           వెర్రి వెర్రి గా నిన్ను పిలుస్తుంటే
            చిరునగవే నీదు  మౌనం!
            దారి చూపి దగాపడ్డ
            తనువేమో లేదాయె!!

           వెతుకులాట బ్రతుకు లో
            ఏమని వెతుకను ?
            మమత కోసమా,?
             బ్రతుకు కోసమా?

            బ్రతకలేని భయం లేని, దావాగ్ని
             జ్వాలల్లో వేడిమి కోసమా?
             అడిగిన అర్థ మవని ప్రశ్న
             పిలిచిన వినపడని శబ్దంలా!!
   
             కడకు ఉలకక పలకక
              మనసున్న లేనట్టే
              బండరాయిలా ఏమిటది?
              ప్రశ్న కానీ ప్రశ్న!!

              ప్రజా బహుళ్యానికి ఒక
               సవాలా?
               ఏమిటో ఊహ కందని కదలిక
               హృదయాంతరాల ప్రభంజనం!!!
            
            
   

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
సాహితీ ప్రియులకు అపురూప కానుక పొయిట్రి వర్క్ షాప్;-- యామిజాల జగదీశ్
చిత్రం
చిత్రం ;సాక్షి- 9వ తరగతి
చిత్రం