చిలుకమ్మా! పిచ్చుకమ్మా!;-రావిపల్లి వాసుదేవరావు--పార్వతీపురం--9441713136

 చిలుకమ్మా? చిలుకమ్మా? తోటకొస్తావా?
దోరజామపండు నువ్వు తిని వెళ్తావా?

పిచ్చుకమ్మ? పిచ్చుకమ్మ? పొలంకొస్తావా?
కంకిలోని గింజలను కొరికి తింటావా?

నెమలమ్మ? నెమలమ్మ? ఇంటికొస్తావా?
పురివిప్పి నాట్యము చేసి వెళతావా?

మైనమ్మా? మైనమ్మా? పెరటికొస్తావా?
తీయనైన మాటలను ముచ్చటిస్తావా?

కోడమ్మా? కోడమ్మా? గూటికొస్తావా?
గొంతెత్తి కూతతో మేల్కొలుపుతావా?

కాకమ్మ? కాకమ్మ? గుమ్మం కొస్తావా?
కావ్...కావ్...మనీ టాటా చెపుతావా?

కామెంట్‌లు