బాల కథా దీపిక (బాలల కథలు);-యాడవరం చంద్రకాంత్ గౌడ్ సిద్దిపేట--9441762105
 బాల్యం అమూల్యమైంది. దేవుడిచ్చిన వరం. తిరిగి చేరలేని తీరం లాంటిది. ఒక్కసారి చిన్న పిల్లవాడిలా ఆటలాడుతూ, గెంతులేసిన, చిందులేసిన, మాటలన్నీ మనసులో మెదిలిన సమయంలో ఆనంద తాండవం తెలిసేలా చేస్తుంది బాల్యం. మరోసారి మళ్లీ బాల్యంలోకి వెళ్తే బాగుండని అనిపిస్తుంది.
కథలంటే ఆబాల గోపాలానికి చాలా ఇష్టం. పిల్లలు కథలు అంటే చెవి కోసుకుంటారు. నాయనమ్మ, అమ్మమ్మ ,బామ్మ తాతయ్యలు తమ పిల్లలకు మంచికథలుచెప్పేవారు.బాలల కోసం ఆనాటి పంచతంత్రం నుండి నేటి పంచరంగుల కాలం వరకు పిల్లల కోసం ప్రత్యేకంగా కథలో రాయడం పరిపాటయింది. కాశీ మజిలీ కథలు, తెనాలి రామకృష్ణ కథలు చందమామ కథలు మొదలగునవి ప్రజల గుండెల్లో నేటికీ కదలాడుతున్నవి.
పిల్లల మానసిక స్థాయికి తగ్గట్టు, వారి స్థాయికి దిగి బాల సాహిత్య కవులు రచనల లో భాగంగా కథలను రచించి, మంచినీతిని అందిస్తూ, వారి మానసిక వికాసానికి దోహదం చేస్తుంది బాల సాహిత్యం.కల్మషం లేని బాల్యం ఏ ఒక్కరికి బానిస కాకుండా అందర్నీ కలుపుతూ పరుగు సాగిస్తుంది అలాంటి పరువులలో అడుగులేస్తూ బాలల కథ సాగరంలో బాసటగా  యువకవి, కథల మామయ్య ఉండాల రాజేశం గారు రాసిన ,"బాలల కథ దీపిక" దోహదపడుతుంది అనడంలో సందేహం లేదు.
ఎవరికి కష్టం వచ్చినా  ఆత్మీయ కలయిక ద్వారా తీర్చుకోవచ్చని "మాఘమాస జాతర" కథ ద్వారా చక్కటి సందేశం అందించారు రచయిత. అమ్మ భాషలో పట్టు సాధిస్తేనే అన్ని భాషలు వస్తే అని చక్కటి సందేశంతో మాతృభాష పైన ప్రేమ పెరిగే విధంగా "అమ్మ భాష"లో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.
కలిసికట్టుగా జట్టుగా ఉండి విజయం సాధించవచ్చు అని "సాంబయ్య జట్టు" కథ ద్వారా   ఐకమత్యమే మహాబలం అని చెప్పారు. చేసే వృత్తి పట్ల అంకితభావంతో మెలగాలని సూచనలను "కొమురయ్య కట్టుబాటు "కథ లో తెలుసుకుంటాం.
ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తామని విషయాన్ని "సమయస్పూర్తి" కథలో తెలుసుకుంటాం. పట్టుదలతో ఉంటే సాధ్యం కానిది అంటూ ఏదీ లేదని , గొప్పగా రాణిస్తారననే నీతిని "పట్టుదలతో ప్రతిభ" కథ లో ఉంది. అన్నదమ్ములు వలె కలిసి మెలిసి ఉండి తగాదాలను పక్కన పెట్టాలి అనే సందేశం "తాతల తగాదాలు"లో తెలియచెప్పారు.
ఈ బాల కథ దీపికలో మొత్తం 15 కథలు చక్కటి నీతితో సందేశాత్మకంగా తీర్చిదిద్దారు కవి ఉండ్రాళ్ళ రాజేశం గారు. ఇందులోనే ప్రతి ఒక్క కథ ఆణిముత్యంగా ఉందనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. విద్యార్థులను ఆలోచింపజేసే విధంగా, వారి భావి జీవితానికి ఒక దారి చూపే విధంగా ఉంది. ప్రతి కథ కు తగ్గట్టు చిత్రాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అంతే గాక చదవాలనే తపన కలిగిస్తుంది.
ఇలాంటి కథలను మరెన్నో కవి ఉండ్రాళ్ల రాజేశం గారి కలం నుండి జాలువారాలని  కోరుకుంటూ శతథా సహస్ర అభినందనలు.
బాలల కథలైన బాల కథ దీపిక ముఖచిత్రం అందంగా ఆకర్షణీయంగా రంగురంగులతో తీర్చిదిద్దారు. డిటిపి బటర్ఫ్లై గ్రాఫిక్స్ సిద్దిపేట గారు అందించారు. పుస్తకంలోని మొత్తం పేజీల సంఖ్య 52. పుస్తకపు వేల 40 రూపాయలు

పుస్తక ప్రతులకు:
ఉండ్రాల రాజేశం
ఇంటి నెంబర్ 20_105/28 
వినాయక్ నగర్ ,
నాసర్ పుర సిద్దిపేట .
502103
చరవాణి:9965946984





కామెంట్‌లు