*కులం లేదు...మతం లేదు;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 వేమన తన కులాన్ని మతాన్ని తన ఉనికిని ఎక్కడ చెప్పుకోలేదు  తన రచనలను ఆధారం చేసుకుని అనేకమంది  వారి వారి ఇష్టం వచ్చినట్లు వారి పద్ధతిలో వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు.  ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా అని ఆయన వ్రాస్తే  ఆయనకు పెళ్లి అయింది ఆమె గద్దర మనిషి కనుక అతను యోగి గా మారాడు అని చెప్పేవారు కొంతమంది ఉన్నారు  వారు అన్ని మతాలను అన్ని కులాలను అన్ని జాతులను  విమర్శించినా వారు ఒక్క జంగమ కులాన్ని మాత్రం  ఎలాంటి విమర్శలకు గురి కానివ్వలేదు.. కనుక అతని కులం  జంగమ కులము అని  కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. ఏది నిజమో అన్నది ఏ ఒక్కరికి తెలియదు  కారణం ఏ ఆధారాలు మనకు లేవు. అనేకమంది అనేక కోణాలలో  పరిశోధన చేసినా బయటపడని రహస్యం అది.
ఏ బిడ్డ ఈ భూమి మీదకు వచ్చినా  కులం పేరుతోనో, మతం పేరుతోనో  వచ్చి తన జీవనాన్ని కొనసాగించాడు.  కొంతమంది  స్వార్థపరులు అనుకోవచ్చు  సమాజం కోసం అనుకోవచ్చు  కొన్ని శాఖలుగా ఏర్పాటు చేసి వీరిది ఈ కులం వారిది ఆ జాతి మరొకటి అంటూ విభజించి  మానసికంగా భౌతికంగా వాటిని పాటించారు తప్ప  అసలు మానవ స్వరూపం భగవత్ స్వరూపం కదా  భగవంతుని ప్రతిరూపమే తాను దానిని కాదనే అధికారం ఎవరికి ఉంది  అహం బ్రహ్మాస్మి అని చెప్పిన ఉపనిషత్ వాక్యాన్ని  తప్పుగా వ్యాఖ్యానం చేసే ధైర్యం  ఏ విధ్వంసం ఉన్నదా  కాలక్షేపం కోసం చేసిన భజనలు తప్ప మరేది కాదు అని ఆయన అభిప్రాయం చెబుతూ మీ మనసుతో మీరు ఆలోచించండి మీకే తెలుస్తుంది అని సలహా కూడా ఇస్తున్నాడు వేమన. ప్రతి జీవి తన పుట్టుక నుంచి మరణం వరకు ఆలోచిస్తూనే ఉంటుంది  ఏ వయసుకు సంబంధించిన ఆలోచన ఆ వయసుకు తగినట్లుగా ఉంటుంది తప్ప  కొత్త విషయాల వైపు మనసు  మళ్లదు. కులాలను గురించి మతాలను గురించి లోతుగా ఆలోచించాలంటే  పరిణతి చెందిన పక్వమైన మనసు ఉండి తీరాలి  లేకపోతే తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అవుతుంది. అంత మాత్రం చేత దానిని అలా వదివేయకుండా దానిని సాధించడం కోసం తపన, కృషి ఉండి  దానికి తగినట్లుగా ప్రవర్తించినట్లయితే  దాని ఫలితం దానికి ఉంటుంది అన్న విషయాన్ని వేమన మనకు తెలియజేయాలని  ప్రయత్నం చేశాడు. తన ఆటవెలది ద్వారా కనుక ఆ స్థితిని అర్థం చేసుకొని  ప్రవర్తించండి అని మనలను హెచ్చరిస్తున్నాడు ఆ పద్యం చదవండి.


"ఏది కులము నీకు ఏది మతంబురా
పాదుకొనుము మదిని పక్వ మెరిగి
యాచరించుదాని  యంతము దెలియుము..."


కామెంట్‌లు