బొచ్చెడు బువ్వకి....
నంజు లేకపోయినా...
అవి పొడి మెతుకులే ఐనా...
బెల్లం చుట్టూ చేరిపోయిన
చీమల్లా... పిల్లలు !
ఇదీ మన దేశ స్థితి.... !
స్వర్ణోత్సవాలు
జరుపుకొంటన్నా...
మారని పరిస్థితి... !!
గమ్యం తెలియని...
గతిలేని బ్రతుకులు... !
బంగారు బాల్యం...
అనుభవిస్తున్న వెతలు !!
కామానికి కనటమే గానీ...
పెంచే బాధ్యతను...బరువని
గాలికి వదిలేసిన...
కన్న వారి నిర్లక్ష్యానికి
నిదర్శనలు.... !
పిల్లలను కనటమే....
గొప్ప కాదర్రా.... !
పశువులూ - పక్షులూ...
కంటున్నాయ్... !!
మీలాంటివాళ్ళకన్నా...
అవే నయం... !
రెక్కలొచ్చేవరకూ...
బాధ్యతగా... ప్రేమతో
చూసుకుంటాయ్ !!
పెంచలేని వాళ్లకు...
కనే అర్హత లేదు.... !
కనకండి...మీలాంటివాళ్ళు
పిల్లలను కనకండి !!
వాళ్ళ బ్రతుకుల్ని...
వీధికుక్కల బ్రతుకులు
చెయ్యకండి !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి