రుబాయీలు
==========
1
మహారాష్ట్ర దేశమునా పుట్టెనులె గోదావరి
పంట పొలము ఆధారమూ ప్రవహించెలె గోదావరి
దక్షిణమున గంగవలెను పుణ్య నదిగ ప్రసిద్ధమూ
అంతర్వేది సాగరమున కలసెనులే గోదావరి
2
పాపికొండ ప్రవహించి సాగెనులే గోదావరి
భద్రాచల రామయ్యను తాకెనులే గోదావరి
ఉభయ తెలుగు రాష్ట్రాలూ సస్యశ్యామ లమైనాయి
కవులకునూ కావ్యాలకు ప్రేరణలే గోదావరి
3
సేద తీర్చు వెన్నెలలో అందాలే గోదావరి
గౌతమితటి వేదఘోష వినిపించెలె గోదావరి
ధర్మపురీ పట్టిసీమ కొవ్వూరూ పుణ్యక్షేత్రాలు
విశ్వనాథ కలములోన పలికెనులే గోదావరి
తల్లి గోదావరి--అద్దంకి లక్ష్మి-- ముంబై
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి