లలితగీతం:- కోరాడ నరసింహారావు !
పల్లవి :-
      ఎగిరే పక్షికి, ఈదే చేపకు 
ఎవరు నేర్పినారావిద్యలు..., 
  పుట్టుకతోనే  సహజముగానే 
 వచ్చెనహో  ఆ  సామర్ధ్యము !
         "ఎగిరే పక్షికి...... "
చరణం :-
    రోకటి బండిని చూసి రైలును 
పక్షిని చూసి విమానమును.... 
  చేపను చూసి జలాంతర్గామిని 
కనిపెట్టిన నీకు,ఈమిడిసిపాటు 
  ఎందులకు.... !?
  కీటకములను,పశుపక్ష్యాదుల నూచూసి నేర్చిన ఓ మనిషీ.. !
అణగద్రొక్కటం ఒకటే తెలిసీ.... 
చలాయించేవు అజమాయిషీ !!
       "ఎగిరే పక్షికి........ "
చరణం :-
     జుగుప్సాకర గొంగళి పురుగే 
సీతాకోక చిలుకగ మారగ.... 
  మేధావియైన ఓ మనిషీ.... 
  మంచిగ నీవు మారలేవా... 
 మంచిగ నీవు మారలేవా.... 
  నీవు  మనిషి గా... మారలేవా 
          ******-

కామెంట్‌లు