సుప్రభాత కవిత ; -బృంద
వెలుగురేఖలు 
చిందగానే
గగనమంతా  
వెలిగిపోయెను

జగతి నిండా 
కరుణ కురువ
కళలు నిండగ 
విరిసి నవ్వెను.

శాంతి సౌఖ్యములు 
వెల్లి విరియగా
లోకబాంధవుని
రాక సాగెను.

హరితవర్ణము 
అలముకొనగా
అవని మొత్తము 
అందముగ మురిసెను

పచ్చదనముల 
విచ్చిన ప్రకృతి 
నూతన వధువై
సొగసులొలికెను.

బంగరు రంగుల
మెరిసిన మేఘము
పొంగారు ప్రేమను
ఒడిసి పట్టెను...


జీవన రేఖల
తీరు మార్చగ
మయూఖ కాంతులు
భువిని నింపెను

ఆప్తమిత్రుడి
ఆగమనానికి
అంబరమంతా
హారతి పట్టెనువ

హారతి వెలుగున
హాసము  నిండగ
భానుని బింబము
సాక్షాత్కరించెనదిగో

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు