గైకొనుమయ్యా ---కోరాడ నరసింహా రావు !

 కవికులమున... కవనరవివై... బుట్టి...నీఅక్షర కిరణమ్ములతో.
సమాజ చాందస చీకట్లను తొల గించి... సాహిత్యమునకు నూ తన బాటలువేసి...నవీన సరళ 
మార్గమునకవులనునడిపించి న ఓ గురజాడ మహాశయా !
 మేమంతా...నీ ఏకలవ్య శిష్యు 
లమేనయ్యా.... ! 
... ఐనా  నువ్ మాత్రము ద్రోణా
చార్యుడవు  కాబోకుము !!
 నిన్నభిమానించి,అనుసరించి,
నీవెనకే నడిచినా...కుల, మత, ప్రాంత,వర్గవిభేదముల జూపక 
సమాజ హితమునుగోరుమీరెల్ల రునాకాప్తులె యనుచు...
. సాహిత్యమునే ప్రేమించి... 
సమానముగఅందరినీఅభిమానించే...ఔన్నత్యము నీదియని 
భావి కవిసమాజమునకు నీ తేజము సమముగా ప్రసరించెడి సూర్యుడవని... 
 ప్రణతులనిడుతున్నానివియే 
..గైకొనయ్యా.... 🙏💐🙏🌷🙏******
కామెంట్‌లు