వింత మొక్క! అచ్యుతుని రాజ్యశ్రీ

 సుమేర రాజు ఆరోజు ఏంటో చికాకుగా ఉండటంతో  తన పరివారంతో కల్సి తోటలో షికారుకి బైలుదేరాడు.ఓమూల విచిత్రంగా ఉన్న వింత పూలమొక్క కన్పించింది. ఆపూలను కోద్దామని చేయి వేశాడు.అంతే!"ఆగు!కేవలం పవిత్ర మనసు కలవాడే నాపై చేయివేయాలి.అతనే నాపూలను కోయగలడు." ఆమొక్కమాటలకు అహంకారం తో "నేను ప్రజాదరణ పొందిన వాడిని " అని మొండిగా ఆపూలచెట్టుపై చెయ్యి వేయటం ఆలస్యం  తేలుకుట్టినంత బాధగా అరిచాడు. నిప్పు రవ్వలు వెల్వడి రాజు చెయ్యి నల్లగా కమిలిపోయింది."అవును తప్పు నాదే! మరి నాచేయి మామూలుగా ఎలా మారుతుంది?"" ఒక పవిత్ర పరోపకారి పాపన్న నన్ను తాకేదాకా అంతేనీచెయ్యి". రాజు దండోరా వేయించాడు."ఎవరు ఆమొక్కను తాకి నాచేతిని మామూలు స్థితికి తెస్తారో వారి కి మంచి పదవి ఇస్తాను." చాలా మంది ప్రయత్నాలు చేసి తమచేతులు నల్లగా మారటంతో నిరాశతో వెనుదిరిగారు.రోజులు గడుస్తున్నాయి. రాజు దిగులు తో ఉన్నాడు.వైద్యుల మందులు పనిచేయటం లేదు. ఆరోజు చెప్పులుకుట్టే వాడు రాగానే అంతా కల్సి "తోళ్ల వాసన కొడుతోంది. "అని ఒక్క తోపు తోశారు.అతను వెళ్లి ఆపూల మొక్కపై పడ్డాడు. ఆశ్చర్యం! అతని చేతులు మామూలుగానే ఉన్నాయి.రాజు చేతులు యధాప్రకారం మారాయి. రాజు అక్కడకి రాగానే మొక్క ఇలాఅంది"రాజా!ఇతను కులమత జాతి వర్ణ వర్గాల వివక్షత చూపకుండా ఎవరిపాదాల సైజు చెప్పులు వారికి  కుట్టి ఇస్తాడు.వేసవిలో బొబ్బలు ఎక్కవు.శీతాకాలంలో  పాదాలు పగలవు.వచ్చిన డబ్బుతో  సంతృప్తిగా బతికే  ధన్యజీవి."అంతే అంతా ఔనంటూ తలూపారు.పేదగొప్ప అంటరానితనం ఆమొక్కముందు బలాదూర్  ఐనాయి.చెట్లు జంతువులకి గొప్ప డాంబికాలు పోవడం తెలీదు మరి.ప్రకృతి మనకు పెద్ద బాలశిక్షసుమా🌹
కామెంట్‌లు