హరి మాజిక్! అచ్యుతుని రాజ్యశ్రీ
 హరి పేకముక్కలలో 4ఆసులు తీసి శివాని పిల్చి ఒక ఆసుని తీయమంటాడు .బోర్లా ఉన్న ఓఆసుని శివా తీస్తాడు."నీవు తీసిన ఆసు ఏమిటో నేను చెప్తా" అంటూ ఓకాగితం ని కాల్చి ఆబూడిదను తన చేతిపై ఒక చోట రుద్ధుతాడు.ఆశ్చర్యం!ఆతీసిన ఆసుముక్కడిజైన్ కన్పిస్తోంది. దీని వెనకున్న ట్రెక్ ఏమంటే 4ఆసుల పేర్లు డిజైన్లు  సబ్బుతో రెండు చేతులపై ప్రత్యేకం ఒక్కో చోటరాసి గుర్తు పెట్టుకుంటాడు.ఆప్రాంతం లో కాగితపు బూడిద రాయగానే ఆపేరు కన్పడ్తుంది.ఎక్కడ ఏఆసుపేరు రాశాడో గుర్తుపెట్టుకోవాలి.అంతే!
ఇక లెక్కల గారడీ ఇలా చేస్తాడు.3అంకెల సంఖ్య రాయి శివా" అనగానే 341 రాశాడు.హరి అన్నాడు "దాన్ని తిరగేసి రాయి" 143  "శివా!పెద్ద సంఖ్య లోంచి చిన్నది తీసేయి.341-143=198 వచ్చింది. "శివా!దాన్ని తిరగేసి రాయి" 891 "చేశాను హరీ!" 
"ఇందాక మైనస్ చేసిన  దానితో కలుపు"198+891=1089 వచ్చింది హరీ"శివా అన్నాడు. ఇలా ఏనెంబరు తో చేసినా  జవాబు 1089 అనే రావటం నిజంగా తమాషా కదూ?🌹

కామెంట్‌లు