పేదరికమే శాపమైనా..
ఎవరో వస్తారు
ఏదో చేస్తారని ఎదురు చూడక
నా రెక్కల కష్టంతో
బ్రతుకు బండిని నడుపుతున్నాను. ఆత్మవిశ్వాసమే ఇరుసుగా...!!
ఉపాధి వేటలో ఆత్మాభిమానం ఆవిరైనా...
చదువు విలువల దారిలో
నీవు చక్కగా నడువు...
రేపటి నీ బాట
ఎందరికో అవుతుంది పూలబాట...!!
తలకు మించిన భారమైనా
నా పోరాటం...
నీ భవిష్యత్తు కోసమేనని గుర్తించి..
ఏ ఆకర్షణకూ లోను కాక
అడ్డదారుల్లో అడుగిడక
కష్టమైనా
చదువును ఇష్టంగా చదువుకో
ఏకాగ్రతే వేదికగా చేసుకొని...!!
మనసు విరబూసే వయసులో
చదువునే గమ్యంగా చేసుకున్న
నా బిడ్డ నేటి గమనం
రేపటి వాడి "విజయ ప్రస్థానం"
దర్జాగా వీక్షిస్తాను
బ్రతుకు బాటలో బాటసారినై...!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి