ఈ లోకంలోకి
కొందరు సంతోషం కోసం వస్తారు
కొందరు దుఃఖం కోసం వస్తారు
మరికొందరు త్యాగం కోసం వస్తారు!!
ఈ లోకంలోకి
కొందరు స్వార్థం కోసం వస్తారు
కొందరు అధికారం కోసం వస్తారు!!
మరికొందరు
ఈ లోకంలో
శాశ్వతంగా ఉండిపోవాలని వస్తారు
కొందరు తాత్కాలికంగా ఉండడానికి వస్తారు
కొందరు ఉండడమే ఇష్టం లేకుండా
వచ్చి పోతుంటారు!!?
ఈ లోకాన్ని
కొందరు సందర్శిస్తారు
కొందరు లోకాన్ని నిర్మిస్తారు
మరికొందరు లోకాన్ని నిర్మూలిస్తారు!!
కొందరు ఈ ప్రపంచంలోకి
సరదా కోసం వస్తారు
కొందరు సీరియస్ గా వస్తారు
మరికొందరు గుర్తింపు కోసం వస్తారు!!?
కానీ అందరూ
ఈ లోకంలోకి
ధనం కోసం వస్తారు!!!?
దొరికినంత దాచుకుంటారు
దొరికినంత దోచుకుంటారు!!!?
ఎవరైతే ఈ లోకంలోకి
అమ్మ కోసం వస్తారో
అమ్మాయి కోసం వస్తారో!!?
వారు మాత్రమే ఈ లోకాన్ని
పూర్తిగా చూస్తారు అర్థం చేసుకుంటారు!!?
Sunita Pratap teacher palem nagarkurnool dist 🙏🙏
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి