క్షమయా ధరిత్రీ ;(చిత్ర కవిత )--చిత్ర కవిత :-- కోరాడ నరసింహా రావు !
బరువు - బాధ్యతలలో.... 
మగవారికిఏమాత్రంతీసిపోని... 
ఆడవారి సాహసం... !

ఆర్ధికంగ ఎదుగుదలకు... 
 ఎనలేని ప్రయత్నం !
కుటుంబసౌఖ్యమేపరమావధిగా....శ్రమించే తత్త్వం !!

మగని కష్టం కేవలం బయటనే 
ఇంటా బయటా... కష్టపడినా 
 విసుగుచెందని భార్య  వైనం..!

ఓర్పు -సహనం... 
     ఆడవారికే సొంతం !
 అందుకే ...  ఆమె.... 
   క్షమయా ధరిత్రియని... 
 కొనియాడ బడినది.... !

   పురుషుడు మహారాజు... 
    ఐనా, కాకున్నా..., 
 మహిళలే మహారాణులు... 
  ఈ ఇలలో... కాదన గలవారీ 
      ఇలలో ఎవరన్నా... !?
       ******

కామెంట్‌లు