ఉన్నాడు ఒకడున్నాడు;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఉన్నాడు ఒకడున్నాడు
ఆంధ్రుడు
ఆత్మీయుడు
అమరుడు

ఉన్నాడు అచటున్నాడు
తెలివైనవాడు
తెలియజెప్పేవాడు
తెలుగుదేశమువాడు

ఉన్నాడు చూస్తున్నాడు
ఘనుడు
విఙ్ఞుడు
తేజుడు

ఉన్నాడు
కవి ఒకడున్నాడు
కవితలు వ్రాస్తాడు
కమ్మదనాల నిస్తాడు

ఉన్నాడు 
కలము పట్టేవాడు
కాగితాలపైగీసేవాడు
కవనం చేసేవాడు

ఉన్నాడు
అక్షరాలు అల్లేవాడు
పదాలు పేర్చేవాడు
భావాలు బయటపెట్టేవాడు

ఉన్నాడు
మనసున్నవాడు
మదులుదోచేవాడు
మురిపించేవాడు

ఉన్నాడు
కనిపించనివాడు
వినిపించేవాడు
రవినితలపించేవాడు

ఉన్నాడు
ఆలోచించేవాడు
అందాలుచూపేవాడు
ఆనందమిచ్చేవాడు

ఉన్నాడు
మంచితనం కలవాడు
మానవత్వం ఉన్నవాడు
మనుజులను ప్రేమించువాడు

ఉన్నాడు
ఊహలలో తేలేవాడు
ఊయలలో ఊపేవాడు
ఉత్సాహం నింపేవాడు

ఉన్నాడు
మాటలు ఉరిమేవాడు
మదులు మెరిపించేవాడు
కవితాజల్లులు కురిపించేవాడు

స్వాగతం సుస్వాగతం
సుకవికి స్వాగతం
సన్మార్గునికి స్వాగతం
సుకవితలకు స్వాగతం

==========================

(ఆంధ్రుడు అంటే తెలుగువాడుగా అర్ధంచేసుకోవాలని మనవి
తెలుగుదేశమువాడు అంటే తెలుగు ప్రాంతీయుడుగా అర్ధంచేసుకోవాలని మనవి)

కామెంట్‌లు