సహజ లక్షణాలు(బాలగేయం);--గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు
నాట్యం చేయుట 
నెమలికిష్టం
అల్లరి చేయుట
పిల్లలకిష్టం

పరిమళించుట
పూవుల ధర్మం
పకపక నవ్వుట
బాలల నైజం

ఫలములిచ్చుట
తరువుల త్యాగం
ప్రేమ పంచుట
ఎంతో భాగ్యం

నైతిక విలువలు
మనిషికి చాలు
కల్గియుంటే
చాలా మేలు


కామెంట్‌లు