అడుగుజాడలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆరోజు శివా ఇంటికి వచ్చేసరికి  అమ్మ నాన్న చిర్రుబుర్రులాడుతున్నారు." కొత్త సంవత్సరం వస్తోంది అని పార్టీ అని రాత్రి అంతా బార్ లో  స్నేహితుల ఇంట్లో గడువుతారా?"అమ్మ అరుస్తోంది."ఐతే ఇంటికే తెచ్చుకోమంటావా? ఫ్రెండ్స్ తో ఉన్న మజా నీకేం తెలుసు?" తండ్రి చిటపటలాడుతున్నాడు.ఇంక మూడు రోజులు పోతే కొత్త ఏడాది!"ఆ ఒక్క రాత్రి సరదాకోసం నెలంతా ఎంత ఇబ్బంది పడాలో మీకు ఏంతెలుసు?" సరదాలు చంపుకోవాలా అని నాన్న  ఇల్లు ఒళ్లు గుల్ల అని  అమ్మ  నోటి తో యుద్ధం చేస్తున్నప్పుడు శివా నిశబ్దం గా వింటున్నాడు. తెల్లారగానే  అన్నాడు "అమ్మా! నేను కూడా  ఈనెల 31రాత్రి మాఫ్రెండ్స్ తో గడువుతా! కేక్స్ కట్ చేస్తాం.ఆటలు పాటలు.నాకు పైసా ఖర్చు ఉండదు." "అదేంటిరా! ఇంట్లో నీవు కూడా లేకుండా నేను ఒక్క దాన్ని ఎలా?" "నీవు టి.వి.చూసుకో. ఇరుగుపొరుగు ఆంటీలతో కబుర్లు చెప్పుకో!" తండ్రి విని అన్నాడు " శివా!నీవింకా ఆరోక్లాస్ ! ఇప్పటినించి పార్టీలు  బైట రాత్రి గడపటం వద్దు. " "ఏంనాన్నా! నీవు తిరగడం లేదా? అమ్మ కూడా ఇరుగుపొరుగు తో ఎంజాయ్ చేస్తుంది.  నన్ను విడిచి అమ్మ పొరుగు ఇంటికి కూడా వెళ్లదు.అందుకే  నేను లేకపోతే  అమ్మ కాసేపు కబుర్లు  పాటలతో సరదాగా గడువుతుంది. " అంతే అమ్మా నాన్న  వాడి మాటలు విని  అవాక్కు ఐనారు.అంతే!ఇక తను బైట బార్ కి వెళ్లరాదని ఇంట్లో శివా భార్యతో సరదాగా గడపాలని నిశ్చయించుకున్నాడు తండ్రి 🌹
కామెంట్‌లు