శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం విశాఖపట్నం లోని బురుజుపేట పరిధిలో కల ప్రసిద్ద దేవాలయం.ఇక్కడి అమ్మవారు శ్రీ కనకమహాలక్ష్మి విశాఖ ప్రజల గ్రామదేవతగా వెలుగొందుతుంది
బంగారం ,వెండి కొన్నా, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతున్నా ముందుగా కనకమహాలక్ష్మి ఆశీస్సులు అందుకోవడం ఉత్తరాంధ్ర వాసులకు ముఖ్యంగా విశాఖవాసులకు చాలా సెంటిమెంట్. గోపురం లేని ఈ ఆలయంలో భక్తులు నేరుగా అమ్మవారికే పూజలు చేసుకోవడం ఇక్కడి విశిష్టత..పైగా 24 గంటలూ ఆ ఆలయం తెరిచే ఉంటుంది. మరీ ముఖ్యంగా మార్గశిర మాసం గురువారం భక్తజనంతో కనకమహాలక్ష్మి సన్నిది కళకళలాడుతుంది.
శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారు విశాఖపట్నంలో భక్తుల నీరాజనాలతో విలసిల్లుతున్నది. భక్తులపాలిట కల్పవల్లిగా ఆరోగ్యాన్ని, స్త్రీలకు ఐదవతనాన్ని ప్రసాదించే దేవతామూర్తిగా కొలువబడుతోంది. శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారిని సత్యంగల తల్లిగా, కోరిన వరాలిచ్చే కొంగు బంగారంగా, స్త్రీలకు ఐదవ తనాన్ని, నగరవాసులకు ఆరోగ్యాన్ని ఇనుమడింప చేసే దేవతామూర్తిగా భక్తులు శ్రీ అమ్మవారిని అత్యంత భక్తిశ్రద్ధలతో సేవిస్తుంటారు
కలియుగారంభంలో సద్గుణ సంపన్నుడైన ఒక బ్రాహ్మణుడు దైవ సాన్నిధ్యం పొందాలన్న కోరికతో కాశీకి ప్రయాణమై విశాఖ తీరం వెంబడి నడుస్తూ బురుజుపేట చేరుకున్నాడు. మధ్యాహ్న సమయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు స్నానమాచరించేందుకు బావి దగ్గరకు వెళ్లాడట. సూర్యునికి ఆర్ఘ్యం ఇస్తుండగా అమ్మవారి స్వ రం వినిపించింది...తాను బావిలో ఉన్నానని బయటకు తీసి ప్రతిష్టించమని చెప్పింది. తాను కాశీకి వెళ్లే తొందరలో ఉన్నానని ఆ బ్రాహ్మణుడు చెప్పడంతో అమ్మ ఆగ్రహించారని...ఆ ఆగ్రహాన్ని తగ్గించేందుకు పరమేశ్వరుడు ఆమె చేతిలో ఆయుధాన్ని నిర్వీర్య పరిచి వామహస్తాన్ని ఖండించాడట. అప్పుడు ఆ తల్లి శాంతస్వరూపిణిగా మారి శంకరుడికి నమస్కరించగా..కలియుగంలో కనకమహాలక్ష్మిగా సిరులు కురిపించే తల్లిగా పూజలందుకోమని అనుగ్రహించాడని కథనం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి