సేవాభావం;- సి.హెచ్.ప్రతాప్

 మానవ సేవే మాధవ సేవ... సామాజిక సేవకు సంబంధించి లోకంలో తరచుగా వినిపించే మాట ఇది. ‘తోటి మానవులను సేవించడమే భగవంతుణ్ణి సేవించడం’ అని ఇది చెబుతుంది. శ్రీ సత్యసాయిబాబా వంటి సద్గురువులు ప్రార్ధించే పెదవుల కంటే సాయం చేసే చేతులే మిన్న అనే సందేశం ద్వారా నిత్య జీవితంలో సేవ యొక్క ఆవశ్యకతను అద్భుతంగా తెలియజెప్పారు.
లక్ష పువ్వులను సందర్శించే ఒక తేనెటీగ ఒక పౌండ్ తేనెను నిలువ చేస్తుంది. పట్టు పురుగు తాను చనిపోతూ మనకు పట్టు దారాలను ఇస్తున్నది. చెట్లు బతికి ఉండి పూలు, పండ్లు, గాలి, నీడను ఇవ్వడమే గాక, చనిపోయిన తర్వాత కూడా కలప ఇస్తాయి. రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, గాంధీ లాంటి వారు వారి జీవితాలను కొవ్వొత్తిగా వెలిగించి సమాజానికి వెలుగులు పంచారు. విద్యావంతులుగా, సంస్కారవంతులుగా, మానవత్వం పరిమళించే మంచి మనసు ఉన్న మనుషులుగా మనం సమాజానికి ఏం చేయగలమో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.  కష్టాల్లో ఉన్న ఏ మనిషికైనా సాయం చేయడానికి దేవుడు ప్రత్యక్షంగా దిగిరాడు. మరో మనిషే సాయం చేయాలి. బాధలో ఉన్న వ్యక్తి కూడా మరో మనిషి సాయాన్ని కోరుకుంటాడు. అందుకే మానవ సేవయే మాధవ సేవ అంటారు. సాటి మనిషికి సాయం చేయడంలో ఉన్న సంతోషం అది పొందిన వారికి మాత్రమే తెలుస్తుంది. 
కష్టంలో వున్నవారికి తమకు చేతనైనంత సాయం చేయడం, కట్టుకోవడానికి బట్ట, విశ్రాంతి తీసుకోవడానికి మన ఇంటి లోగిలి, ఆకలితో వున్నవారికి కాస్త పట్టెడన్నం పెట్టడం , దుఖంలో వున్నవారికి నాలుగు ఓదార్పు మాటలు చెప్పడం వంటివి మన నిత్య కృత్యం అయితే, మాధవుడు ఎంతగానో తృప్తి చెంది మన కష్టాలు తీరుస్తాడనేది జగమెరిగిన సత్యం.
కొంతమంది పది రూపాయలు సహాయం చేసి పదివేల రూపాయల ప్రచారం కోసం ఆరాటపడతారు. మరికొందరు.. సేవ ముసుగులో ప్రజల్ని తమవైపు తిప్పుకుని వారి ద్వారా అందలాలు ఎక్కవచ్చని భావిస్తారు. ఇంకొందరు సహాయం చేసినందుకు దేశం మొత్తం గుర్తింపు కావాలని ఉబలాట పడతారు. కానీ.. నిజంగా సమాజ సేవ చేయాలని అనుకునే వారికి ఇవేమీ అక్కరలేదు. పట్టవు కూడా. చాలామంది తమకున్న పరిధిలో ఇతరులకు సహాయం చేస్తారు. అది పదిమందికి తెలియాలనే భావన వారికీ ఉండదు. ఇక సేవ చేసే వారికి బిరుదులూ.. పొగడ్తలు అసలు ఉండకూడదు. అవి వుంటే అహంకారం నెత్తికెక్కుతుంది
ప్రజాసేవ చేయడమే లక్ష్యమైతే ప్రశంసలు, గౌరవం, బిరుదులు, ప్రభుత్వ సౌకర్యాలకు దూరంగా ఉండాలి. ఒక్కోసారి ఈ విషయాలు అహంభావాన్ని పెంచి సేవాకార్యక్రమాల నుంచి తప్పుకునేలా చేస్తాయి. ఆడంబరాలతో చేసేది సేవ అవ్వదు
కామెంట్‌లు
Popular posts
చిత్రాలు ; ..జ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భారత్ నగర్ (మూసాపేట)- హైదరాబాద్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
చిత్రాలు ; జి.జీవనజ్యోతి టీచర్ వివేకానంద కాన్వెంట్ హైస్కూల్ భరత్ నగర్ హైదరాబాద్
చిత్రం
తెలివితేటలు!! ప్రతాప్ కౌటిళ్యా
చిత్రం