సుప్రభాత కవిత ; -బృంద
వెలుగుల వాడల
విరిసిన పువ్వులు

మెరిసీ మురిసే
మృదువైన జన్మలు
కొత్త మెరుపులూ
సరికొత్త రంగులూ

పెదవుల నవ్వులూ
పరిమళించే హృదయాలు
ఆనందం పంచే ఆత్రాలూ
ఆవిరయే అందాలు

కొన్ని పెంచడానికే
కొన్ని పంచడానికే
కొన్ని అనుభవించడానికే
కొన్ని నేర్పించడానికే

కొన్ని జన్మలూ....

ఎన్నో సంతోషాలు
ఎన్నో కోరికలు
ఎన్నో నిరీక్షణలూ
ఎన్నో నిర్లక్ష్యాలు భరిస్తూ

అలవాటైన త్యాగాలు
అలవికాని సర్దుబాట్లు
అనుకోని ఇక్కట్లూ
అనలేని ఇబ్బందులూ

అన్నీ సొంతమైన అమ్మలు

ఎన్నో ఓదార్పులు
‍ఎన్నో సౌకర్యాలు
ఎన్నో ధైర్యాలు
ఎన్నో చేయూతలు
పిల్లలకిచ్చే తల్లులు

ఇవ్వటమే తప్ప
తీసుకోవడం తెలియని
ప్రకృతి  మాతకు
ప్రతిరూపాలు...

ఎంత పెద్ద వారైనా
అమ్మ ముందు చిన్నవారే

పరమాత్మనూ
ప్రసవించే  మాతృమూర్తికి
ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం?

పసివారైన పెద్ద వయసులో
తాము  కన్న ఆడపిల్లలా
ప్రేమ చూపటం తప్ప...

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు