ఈ హావభావవిన్యాసం....
సంగీత సాహిత్య సమన్వితం
ప్రకృతి,పురుషుల....
మేలి సంగమం
చూడ... కన్నులకు....
సంబరం.... !.
నటరాజు... గిరికన్యకను
కూడి నర్తించిన వైనం
ఈ పోటా పోటీ నర్తనలో
గెలుపెవ్వరిదో....
ఓటమెవరిదో...
తేలనివ్వక.....
యే ఒక్కరిలో....
ఓటమి యనెడి ప్రశ్నయే రాక
గెలిచీ ఓడుతు...
ఓడీ గెలుచుచు...
గెలుపోటములు తేలక...
వివిధ భంగిమల
విన్యాసముతో...
ఇరువురునూ.....
విజేతలే యైరి ... !
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి