:"చేదు జ్ఞాపకం‌";-నలిగల రాధికా రత్న.
హృదయాన్ని కదిలించినా 
మనసును రగిలించినా
కొత్త అనుభూతిని సృష్టించినా అనంతమైన ఆకాశాన్ని 
అరచేతిలో అందివ్వగల 
శక్తి గల నేత్రం కెమెరా చిత్రం...!!

కెమెరాలో చిత్రం బంధించడం 
నీకు తెలిసిన 
మహత్తర విద్య అయినా...
ప్రమోదం వెనుక 
దాగుంది ప్రమాదం
కాలు జారితే కాటికే ప్రయాణం...!!

కరెంటు స్తంభమే 
అతి ప్రమాదం....
దాన్నే ఆసరాగా చేసుకున్న 
నీ అవివేకం...
నిర్లక్ష్యం నిండు ప్రాణం
తల్లిదండ్రులకు గర్భశోకం..!!

కొత్తదనాన్ని జనానికి 
చేరువ చేయాలని 
ఆరాటం మంచిదే...కానీ
రెక్కడితే గాని డొక్కాడని
కుటుంబానికి నీవే ఆధారం‌..!!

వృత్తిపట్ల నిబద్ధత 
ఉండి తీరాలి కానీ...
తిరిగి రానిది నీ జీవితం 
ఒకే ఒక్క జీవితం...!!
 
ఏం సాధించినా 
ఏం అనుభవించినా 
అనుభూతులు 
నలుగురికి పంచినా
ఉన్న ఈ ఒక్క జీవితంలోనే మిత్రమా..!

నిజాల్ని వెలికి తీసే క్రమంలో 
నీవు ...నీ కుటుంబానికి 
కారాదు ఓ "చేదు జ్ఞాపకం‌"..!!


కామెంట్‌లు