కంటిచూపుతో చెప్పేసే పీలే;-- యామిజాల జగదీశ్
 ఓమారు అర్జెంటీనాతో జరిగిన పోటీలో బ్రెజిల్ ఆటగాడు పీలే కొట్టిన బంతి ప్రత్యర్థి గోల్ స్తంభం అంచున తాకి గోల్ వలయంలోకి పోకుండా బయటకు పోయింది. వెంట్రుకవాసిలో గోల్ మిస్సయింది.
ఆప్పుడు పీలే గోల్ స్థంభాన్ని చూసి "గోల్ స్తంభం సరిగ్గా లేదు. ఎత్తు కాస్తంత తక్కువగా ఉంది" అని చెప్పారు.
మ్యాచ్ రెఫరీతో ఈ విషయమై ఫిర్యాదు చేయగా తొలుత ఆయన "అదేమీ లేదు...అంతా సవ్యంగా ఉంద"న్నారు.
కానీ పీలే పట్టుబట్టడంతో రెఫరీ గోల్ స్తంభాన్ని కొలవగా అయిదు సెంటీమీటర్లు తక్కువ ఉందట. 
ఫుట్ బాల్ మైదానంలో దిగడంతోనే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా కళ్ళతోనే అంచనా వేయగల శక్తి నేర్పు పీలేది. 
ఇప్పటివరకూ ఆయనను అధిగమించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు.
1940 అక్టోబర్ 23న జన్మించిన పీలే పూర్తి పేరు Edson Arantes do Nascimento. అమెరికా శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ పేరులోని ఎడిసన్ ఆయనకు పెట్టారు. 2022 డిసెంబర్ 29న ఆయన ఆస్పత్రిక చికిత్స ఫలించక మరణించారు.
ఆయన తన కెరీర్ లో మొత్తం 1283 గోల్స్ సాధించాడు. అయితే వీటిలో 526 గోల్స్ అనధికారిక ఫ్రెండ్లీ మ్యాచ్ లు, సాధారణ టూర్ గేమ్స్ లో సాధించినవి.  మిగిలిన 757 గోల్సుని అధికారికంగా సాధించినవిగా నమోదయ్యాయి. 

కామెంట్‌లు