మట్టినిమోసే వాడికి రోజుకూలి దక్కుతుంది
పంటను తీసే రైతుకి ఆశ ఒకటె చిక్కుతుంది
ఎవడిచ్చిన అధికారం నేలతల్లి తవ్వి అమ్ము
కామందుకి తరాలుగా పిచ్చిడబ్బు మొక్కుతుంది !!
కాలవిలువ ఒకటేగా నీకైనా నాకైనా
దేహ భ్రాంతి నిజమేగా మంచైనా కీడైనా
వేకువ పిట్టలు కూసే కూతలు ఎంతో మధురం
ఆకలి కేకలు ఉంటవి పంటైనా కరువైనా !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి