ఘనంగా విజయ్ దివస్;-గుండాల నరేంద్ర బాబు
 బివి.నగర్ లోని కే. ఎన్.ఆర్.నగర పాలక ఉన్నత పాఠశాల నందు  10 ఆoధ్ర నేవల్ యూనిట్ ఎన్ సి సి నెల్లూరు లెఫ్టినెంట్ కామాండర్ & కమాండింగ్  ఆఫీసర్ వినయ్ రామచంద్రన్ ఆదేశాలు మేరకు  పాఠశాల ప్రధానోపాధ్యాయులు  విజయ్ ప్రకాష్ రావు సహకారంతో
సెకండ్ ఆఫీసర్ & అసోసియేట్ ఎన్ సి సి ఆఫీసర్ గుండాల నరేంద్ర బాబు  ఆధ్వర్యంలో ఈరోజు విజయ్ దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుండాల నరేంద్ర బాబు మాట్లాడుతూ 1971 భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ దేశంపై భారత్ ఘన విజయం సాధించి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి కారణమైనదని,ఈ యుద్ధంలో  అమరులైన మన వీర జవానులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 16 న విజయ్ దివస్ దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారన్నారు.అమరులైన మన దేశ సైనికుల త్యాగాలకు గుర్తుగా కొవ్వొత్తులు వెలిగించి రెండు నిమిషాలు  ఎన్సీ సి కేడెట్లు మౌనం పాటించి ఘన నివాళులు అర్పించారు.
బాల్యం నుంచే కేడెట్లు దేశ భక్తి సేవానిరతి నిస్వార్థంగా జీవించడం అలవరచుకోవాలని ఉద్భోదించారు.
ఈ కార్యక్రమంలో ఎన్ సి సి కేడెట్లు  పాఠశాల ఉపాధ్యాయులు
పాల్గొన్నారు.
ధన్యవాదములతో...
సెకండ్ ఆఫీసర్
గుండాల నరేంద్ర బాబు
అసోసియేట్ ఎన్ సి సి ఆఫీసర్
కే ఎన్.ఆర్ నగర పాలక ఉన్నత పాఠశాల
బి.వి నగర్,నెల్లూరు
తేది 16.12.2022
సెల్:9493235992

కామెంట్‌లు