గాలివాటంగా కొట్టుకుపోతున్న గుండెనీ సౌందర్య వృక్షపు కొమ్మకు చిక్కిన వేళనాకూ ఒక హృదయం ఉందన్న స్పర్శ!అప్పటి నుంచి అనుక్షణపు తాపత్రయం!ఆశల పుడకలు, కోరికల పుల్లలుపునాదిగా మొదలైన గూటిలో...ఏ పుడక నీకు అసౌకర్యం కల్పిస్తుందోఏ పుల్లముక్క నీకు మచ్చని మిగుల్చుతుందో..పరస్పర వ్యతిరేక భావాలరణరంగంలోగూడు కుటీరమవ్వడం యాదృశ్చికమే!లేతాకుపచ్చ గడ్డిపరకల పానుపుపైఅలవోకగా వాలిన మంచుబిందువులకుంభకారపు వక్రతలాలునీ దేహఛాయాకిరణకాంతికిపరావర్తనయానకాలైనవేళనా గుండెగూటి ప్రేమమందిరాననీ ప్రణయరూపంఆరాధ్యదేవతగా ప్రతిష్టితమావుతూ...నన్ను తాధాత్మ్యతలో నింపేస్తూ...!సమాప్తం
నా గుండె గూటిలో...!(కవిత);-కొత్తపల్లి ఉదయబాబు-సికింద్రాబాద్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి