స్వరమునకు నడకలు నేర్పే
సహకార జంత్రవాద్య మిది !
తెలంగాణమున పాలమూరు లో... పురుడు పోసుకున్నది!!
పేరుకిది మెట్ల కిన్నెర... !
దీనిది చూడచక్కని వన్నె ర.. !!
అత్యుత్తమ జాతీయ పద్మశ్రీ నే
కైవసము చేసికొన్నదిరా... !
తెలంగాణఖ్యాతిని....
ఎలుగెత్తి చాటుతూ....
పోరాటాలకే కాదు...
కళ ల లోనూ మాతెలంగాణ
మేటియే ననీ....
ఈ ప్రపంచమునకు చాటు తున్నదిరా.... !
******
చిత్ర కవిత ; -కోరాడ నరసింహా రావు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి