"అనుభవం" వెంకట్ వంశరాజ్ తెలుగు భాషా పండితులు ZPHS చెంగోల్ తాండూర్
మధి కదిలిస్తే 
మనుసు కవి
మనుసు మరిగిస్తే 
మహకవి

అవసరాలు తీరిస్తే 
అది డబ్బు 
అనవసరాలు తీరిస్తే 
అది జబ్బు

కష్టాల్లో చమరిస్తే
అది కన్నీరు
ఇష్టాల్లో చమరిస్తే 
అది పన్నీరు

ఒకరితో నేర్చుకుంటే 
అనుభవం 
మరొకరికి నేర్పితే 
స్వానుభవం

నీరు మరిగిందా
మేఘమౌతుంది
మేఘమే కరిగిందా
చినుకౌతుంది

కామెంట్‌లు