తిరుప్పావై పాశురం-18, డాక్టర్ అడిగొప్పుల సదయ్య
ఉందు మదకళిత్తన్ - ఓడాద తోళ్ వలియన్
నంద గోపాలన్ మరుమగళే ! నప్పిన్నాయ్ !
కందం కమజుం కుజలి కడై తిఱవాయ్ వంద్
ఎంగుం కోజి అజైత్తన కాణ్, మాదవి

ప్పందల్ మేల్ పల్గాల్ కుయిల్ ఇనంగళ్ కూవిన కాణ్
పందార్ విరలి ఉన్ మ్మైత్తునన్ పేర్ పాడ
శెందామరై క్కైయాల్  శీరార్ వళై ఒలిప్ప
వందు తిఱవాయ్ మగిజింద్ - ఏలోర్ ఎంబావాయ్

 ఇష్టపది-18

మత్త గజముల పీచమడయించు భుజబలుడు,
నందగోపాలకుని ననుగు కోడల! నీళ!
తావెసగు కేశినీ! తలుపు గడి తెరువోయి!
అంతటను ఎగురుచూ అరుచు కోళ్ళను చూడు!

మాధవీ పందిరిన పలుమార్లు కూసేటి
మదాలాపుల మత్తు మధురస్వరములు విను!
నీ మేనబావనే నేమముగ కీర్తించ
పరిశుద్ధ హృదయాన అరుదెంచితిమి తల్లి!

ఎర్రతమ్ములబోలు ఎసవు గాజులు మోగ
సంతసంబున వచ్చి బంతులాడినచేత
తలుపు తెరచియు మాకు దర్శనము కావించు!
ఇది మాదు వ్రతమండి! ఇచ్ఛతో చేరండి!!

అనుగు కోడల= ముద్దుల కోడల
తావి+ఎసగు = పరిమళము వ్యాపించు
కేశిని = కురులు కల్గిన స్త్రీ
మాధవీ పందిరి= పూలగురివింద తీగతో అల్లుకున్న పందిరి
మదాలాపి =కోకిల,నేమముగ =నియమముగా
ఎసవు = ప్రకాశించు

డాక్టర్ అడిగొప్పుల సదయ్య
జమ్మికుంట,కరీంనగర్
9963991125


కామెంట్‌లు