నటనకు వ్యాకరణం- బందా గారు (26);-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 బందా గారు నాటక శాఖను ప్రారంభించిన తర్వాత నాటకాలను మూడు విధాలుగా విభజించారు.  పదిహేను నిమిషాలు, 30 నిమిషాలు, 60 నిమిషాలు  ప్రతి వారు ఒక చిన్ననాటిక 15 రోజులకు అరగంట నాటిక  నెలకు ఒకసారి గంట నాటకం  ఒక నెల విజయవాడ మరొక నెల హైదరాబాద్ కేంద్రాలు  ఏర్పాటు చేస్తే వీరి కార్యక్రమాన్ని వారు వారి కార్యక్రమాన్ని వీరు రిలే చేసేవారు. తర్వాత విశాఖపట్నం, కడప కేంద్రాలు కూడా ప్రారంభించినాయి.ఆ నాటకాలు రాయడంలో సిద్ధహస్తులై ఉండి  అంతకుముందు రంగస్థల నాటకాలలో పేరు ప్రఖ్యాతలు పొందిన వారికి ప్రథమ స్థానం ఇచ్చేవారు బందా గారు  కారణం  రంగస్థల నాటకాల గురించి పూర్తిగా ఆయనకు అవగాహన ఉన్నందువల్ల అలా చేసేవారు  తర్వాత అనేకమంది సాహితీవేత్తలను  నాటక కర్తలను పరిచయం చేసిన ఖ్యాతి బందా గారికే దక్కింది. పావు గంట నాటకాన్ని ఉదయం సాధన చేయించి సాయంత్రం రికార్డ్ చేసేవారు  అరగంట నాటకాన్ని మొదటి రోజు రెండో రోజు ఉదయం సాధన, సాయంత్రం రికార్డింగ్  గంట నాటకాలకు మూడు రోజులు తీసుకొని రెండు రోజులు ఉదయం సాయంత్రం మూడో రోజు ఉదయం సాధన చేయించి సాయంత్రం రికార్డింగ్ చేసేవారు.  కళాకారుల ఎన్నిక కూడా  వారి స్థాయిని బట్టి  బి, బి హై, ఏ, ఏ హై, ఏ టాప్ స్థాయిలో ఉండేవి.  బి, బి హై వారిని అప్పుడప్పుడు పిలుస్తూ ఉంటారు.  ఏ, ఏ హై వారిని తరచు పిలుస్తూ ఉంటారు  ఏ హై టాప్ లో ఉన్న నన్ను, కోకా సంజీవ రావుని, సి వి సూర్యనారాయణమూర్తిని  ఎప్పుడైనా పిలవచ్చు  ప్రత్యేకించి  వీ రు మాత్రమే చేయదగిన వేషాలు అని నిర్వాహకులు  అనుకున్నప్పుడు అలా జరుగుతుంది. బందా గారు నాటకాలు ప్రారంభించిన మొదటిలో  కొంతమంది  ముందు చెప్పకుండానే మానేసేవారు  దానిని భర్తీ చేయడం కోసం  బందా గారు ఏం చేశారంటే  ఆ క్షణాన ఎవరితో పడితే వారితో చదివించడానికి వీలులేదు చిత్తం అనవలసి వచ్చిన వేషానికి కూడా ఆడిషన్లో పాస్ అయి ఉండాలి  లేకపోతే అంగీకరించరు.  అందువలన  గుమస్తాలని,  సాంకేతిక నిపుణులను ఎవరెవరికి నాటకాల పైన శ్రద్ధ ఉన్నదో వారిని పిలిచి  వారికి ఆడిషన్ నిర్వహించి  వారిని ఎన్నిక చేయడం జరిగుతుంది దానివల్ల చాలా చాలా వేషాలు  నటించడానికి  అవకాశం లేని పాత్రలను వాళ్లకి ఇస్తూ ఉండేవాడు  దానితో సమయం కలిసి వస్తుంది  అంతా ఆకాశవాణి ఉద్యోగస్తులే కనక ఎవరూ ఏమీ అనుకోవడానికి అవకాశం ఉండదు  నన్ను చిన్న చూపు చూశారు అనే ఆలోచన వారికి రాదు  అలా ఏర్పాటు చేసేవారు బందా గారు.


కామెంట్‌లు