తిరుప్పావై పాశురం-29
శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై సేవిత్తు ఉన్
పొత్తామరై యడియే పోత్తుమ్ పొరుళ్ కేళాయ్
పెత్తమ్ మేయ్ తుణ్ణుమ్ కులత్తిల్ పిఱన్దు
నీ కుత్తేవల్ ఎంగళై కొళ్ళామల్ పోగాదు
ఇత్తె పరై కొళ్వాన్ అన్ఱుగాణ్ గోవిందా
ఎత్తైక్కుమ్ ఏజేజు పిరవిక్కుమ్ ఉన్దన్నోడు
ఉత్తోమే యావోమ్ ! ఉనక్కే నామ్ ఆట్ శెయ్ వోమ్
మత్తైనమ్ కామంగళ్ మాత్తేలో రెమ్బావాయ్
తిరుప్పావై ఇష్టపది -29
బ్రాహ్మమందున లేచి భక్తితో వచ్చితిమి
నిన్ను సేవించుటకు నీరజాక్షా!కనుము!
నీదు పొత్తామరల నెనయు శ్రీ పాదాల
కీర్తించవచ్చాము కేశిమర్దన! వినుము!
ఆలమందల మేపు బేలకులమున నీవు
జనియించితివి కాన మనకు కుదిరెను పొత్తు
సన్నిహిత సేవలకు ఎన్నుకోవలె మమ్ము!
పర కోసమే యిపుడు అరుదెంచలేదయ్య
ఏడేడుజన్మలకు ఎప్పుడును నీతోనె
సంబంధమును నెరపి సంసేవచేసెదము!
మదినితర కోరికల మట్టుబెట్టర సామి!
ఇది మాదు వ్రతమండి! ఇచ్ఛతో చేరండి!!
బ్రాహ్మము = బ్రాహ్మీముహూర్తము
పొత్తామర = బంగారు పద్మము
ఎనయు = పోలు
బేల = అమాయక
పొత్తు = చుట్టరికము,సంబంధము
తిరుప్పావై పాశురం-30
వంగ క్కడల్ కడైంద మాదవనై క్కేశవనై
తింగళ్ తిరుముగత్తు శేయిలైయార్ శెన్ఱిఱైంజి
అంగ ప్పఱై కొండవాత్తై అణి పుదువై
ప్పైంగమల త్తణ్ తెరియల్ పట్టర్బిరాన్ కోదై శొన్న
శంగ త్తమిజ్ మాలై ముప్పదుం తప్పామే
ఇంగిప్పరిశురైప్పర్ ఈరిరండు మాల్ వరైత్తోళ్
శెంగణ్ తిరుముగత్తు చ్చెల్వ త్తిరుమాలాల్
ఎంగుం తిరువరుళ్ పెత్తిన్భుఱువర్ ఎంబావాయ్
తిరుప్పావై ఇష్టపది -30
పడవలుండెడి పాల కడలి మథియించినా
మాధవుని,కేశవుని పపిముఖులు గోపికలు
చేరి కీర్తించిరట శివమొసగు పరనుకొని
ఆనాడు; నిద్ధరకు నలంకారంబైన
విల్లిపుత్తూరులో తొల్లి నలపూసనగ
మాలధారుండైన భట్టనాథుని పట్టి
గోదమ్మ గోపికల గూడి గోవిందునికి
అర్పించి పాడినది అరవ పాశురమాల
ముప్పదిని తప్పకను ముదమంది పాడగా
ఆరోజు గోదమ్మ అనుభవించిన ఫలము
నగసిగల దృఢమైన నాల్గు భుజములవాడు
ఎరుపు కన్నులవాడు,తిరుముగము కలవాడు
సిరిసంపదల తూగు సిరివల్లభుడు ధరను
తిరు కరుణ గురిపించి పరితుష్టినందించు...
పపి ముఖులు =చంద్రబింబము వంటి ముఖముకలవారు
శివము = మంగళము,కల్యాణము
ఇద్ధర = ఈ+ధర= ఈ భూమి
తొల్లి = పూర్వము
నల పూస నగ మాల = తామర పూసలనగలతో చేసినమాల
భట్టనాథుడు = విష్ణుచిత్తుడు
అరవం = ద్రావిడం/తమిళం
నగసిగలు = పర్వత శిఖరాలు
డాక్టర్ అడిగొప్పుల సదయ్య
జమ్మికుంట,కరీంనగర్
9963991125
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి