తే.గీ
అందమైనట్టిపృథ్వి కానందముగను
దేవతామూర్తు లెల్లరు దివిని వీడి
వన విహారంబు కోసమై వచ్చుచుండ
నీలకంఠున్ని వేడెనాకాలనాగు
తే.గీ
స్వామి దయతోడ సెలవియ్య చక్కగాను
భువిని దర్శించి వచ్చెదన్ భవహరుండ
సురులు భూలోకముననున్న శోభజూసి
ముచ్చటించగన్ వింటిని మచ్చుకంత
తే.గీ
యనగ శంభునాథుడు నవ్వి ఘనముతోడ
పుడమి దర్శించి దేవతల్ పూవు వోలె
తిరిగి వచ్చేరు పడకుండ నరులకంట
నిక్కమెరుగంగ నాగువే నీవు యనెను
ఉ.
నాగులభాగ్యులా యనుచు న్యాయముగోరగ దేవదేవుడిన్
వేగిరమందునీశ్వరుడు వేదననాపుచు జెప్పుచుండె యా
నాగుల నైజమేమనగ నమ్రతతోడన నుండలేవుగా
సాగెడి త్రోవలందు జనసందడులెక్కువ పృథ్వియందనెన్
ఉ.
పాములు కాటువేయగనె ప్రాణము సర్రున బోవునే మరిన్
దోమవుగాదు నీవనుచు దోరగ నవ్వుచు చల్లబర్చగా
యేమన బోనుమానవుల నెక్కడనోనొక మూలనక్కుచున్
చీమకు మిన్నవోలె మరి చిత్రము లన్నియు గాంతునేననిన్
చ.
వినయముతోడ నీశ్వరునివేడెను సర్పము పృథ్వి లోనికిన్
ననుమతి నీయమంటు శివునాజ్ఞను గోరగ నిచ్చె నానతిన్
మనుజుల జంపబోకుమని మంగళకారుడు జెప్పి పంపగా
తనువును ముడ్చుకోనిజగతంతయు జూడొక మూలనక్కెనే
చ.
పలువురు కోతిమూకలటు బాటన బోవుచు గాంచి సర్పమున్
కిలకిల నవ్వుతోడ పరుగెత్తక కర్రతొ గ్రుచ్చ సాగిరే
చలనము లేక నుండెనని సంబరమెచ్చగ గేలిజేయుచున్
సులువుగ జెప్పిరందరికి చోద్యము జూపుచు వింత ప్రాణిగన్
చ.
మెలికల తోడ సర్పమిక మెల్లగబోవుచు నుండ రాళ్లతో
పలువురు గొట్టుచుండ తనువంతయు చిట్లుచురక్తమెల్లగా
కలతతొ కృంగె శంభునెడ కాయము జూపుచు బెట్టి దండమున్
పలుమరు మానవాళి యని పల్కితివే హర నిర్దయాత్ములన్
మ.
యన దీనమ్మగు పల్కులెల్లవిని కాయంబున్ గనినీశ్వరుం
డనె ప్రాణంబునకాని గల్గునెడ దండంబుండగఁ దీయవే
ఘనమైనట్టి శిరంబునెత్తి బుస బంగారమ్ముగఁ గొట్టగా
కనినంతన్ నురుకేరు రంకెలతొ నీ కర్తవ్యముఁ జేయుమా!
మ.
ననుచున్ జెప్పిన నీశ్వరాజ్ఞ విని యానందామృతమొందుచున్
కనులారన్ తిలకించసాగెనట నాగన్నై భువినంతయున్
జనసందోహము గానవచ్చినను యా జంగంబుని పల్కుతో
ఘననీయంబుగ దైవమై నిలచె సంఘంబందునఁ ధీమతో

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి