.జోహార్!;-ఎ.రాజ్యశ్రీ 8985035283
జోహారు జోహారు వివేకానంద 
జోహారు జోహారు కీర్తిసాంద్ర!

తల్లి భువనేశ్వరి నోముపంట
తండ్రి విశ్వనాథుని కీర్తి మింటనంట!
భక్తి ప్రేమలలో పెరిగావు
చిలిపికృష్ణుని లా ఎదిగావు!

రామకృష్ణ మఠ స్థాపకునిగా
శారదామాత తనయునిగా
నరేంద్రుడివై అవతరించి
వివేకానందునిగా విశ్వానికే వెలుగు పంచావు!

"సోదరీ సోదరులారా! శాంతి స్వరూపులారా!"చికాగో లో
ఎలిగెత్తి పిలిచావు!
దద్దరిల్లె నీమేఘగర్జన!
ధింధిమి ధింధిమి మోగే
కరతాళ ధ్వనులు!

మనవేదాంత ఉపనిషత్తులు 
సంస్కృతి సాంప్రదాయాలు
ఖండ ఖండాలలో ఉప్పొంగే
ఎగిసి ఎగిసి దుమికె గంగా

"లేవండి సాగండి భయము వీడండి" యువతలో చైతన్యం 
ధైర్య సాహసాలే జ్యోతులుగా
చేరాలి గమ్యం"

సింహమై గర్జించావు!
మానవసేవయే మాధవసేవ యని చేతలో చూపావు!
నడిచేము నీబాట!
తలిచేము నీమాట!
జోహారు జోహారు వివేకానంద 
జోహారు జోహారు కీర్తిసాంద్ర!
...స్వస్తి...

కామెంట్‌లు