ప్రతి పాటలో గాన మౌతాను
ప్రతి ఊహల తలపులో నవ్వునౌతాను
ప్రతి హృదయంలో స్పందనౌతాను
ప్రతి బాధలో వేదన నౌతాను
ప్రతి భావంలో భాష్యమౌతాను
ప్రతి స్పందనలో కదలికనౌతాను
ప్రతీ కావ్యం లో మధురిమనౌతాను
ప్రతి చేతలో కార్యమౌతాను
ప్రతి అనురాగంలో రాగమౌతాను
ప్రతి ప్రేమలో ప్రేమ గీతికనౌతాను
ప్రతి అమ్మలో అనురాగమౌతాను
ప్రతి లయలో. శబ్ధమౌతాను
ప్రతి ఆత్మీయతలో ఊపిరౌతాను
ప్రతి కారణం లో విషయమౌతాను
ప్రతి ఆటలో గెలుపునౌతాను
ప్రతి నాట్యంలో భంగిమనౌతాను
ప్రతి చూపులో కాంతి నౌతాను
ప్రతి ఊపిరిలో శ్వాసనౌతాను
ప్రతి వేడిమిలో వాంఛ నౌతాను
నను అలరించు వారిలో హృదయమౌతాను
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి