ఎగిరింది ఎగిరింది గాలిపటం
ఆనంద సంబరాల ఆవిష్కరణం
అందరూ పొంద వినోదం మహదానందం
ఆ ఆనందం అద్భుతదాయకం!!!
అందరికీ ఉల్లాసం ఉత్సాహం పొంగ
ఉరుకులు పరుగులు ఉత్తేజపు సద్దులు
ఊరంతా నిండిపోవు గాలిపటం పండగలో
తరతమ బేధాలు లేవు, తారతమ్యాలులేవు!!
యుగయుగాల జాతరలో కలిసిపోయి
కనుల పండుగ జరుపుకొందరు
సంతోష వెల్లువలతో సహా భాతృత్వంతో
సంతోషం పంచుకోను సహచరులతో నిండు
కాలం కలిసి రాకపోతే తాడే పామగును
గుజరాత్ లోని బాలిక గాలిపటంతో
ఆటలాడు సమయాన అవనిలోకి ఎగిరే
అద్భుత విన్యాసం అందరూ చిత్తగించే!!
భయం నిండే హృదయాలలో భగవంతుడే
ఎదుట నిలిచే, చేతకాని చేయలేని, చేతలతో
చేష్టలు దక్కి నిలిచిపోయే కాలం
దైవం కడకు చేర్చే గమ్యం కడు
రమణీయంగా!!!
దైవ నిర్ణయం అఖండం అమోఘం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి