కనుమ శుభాకాంక్షలతో
===================
1. అమ్మ ,ఆవు మనం,
నేర్చే తొలి పదాలు ,!
అమ్మ ,ఆవులతోనే,
నిండి ఉంటాయి జానపదాలు!
ఇల వారిద్దరే ,
మనకి నిజ దైవాలు!
మాత లేకుంటే,
గోమాతే మన మాత!
ఆవుపాలే ,
అమ్మపాలై నిలుపు మానవత!
2. దైవ సృష్టిలో ,
గోవు కాదు ఒక జీవం!
అది సమస్తదేవతా,
ప్రత్యక్ష స్వరూపం !
మన "కనుమ పండుగ "
పశు ఆరాధనం!
గోప్రదక్షిణం ,
సర్వపాపహరణం!
గోదానం,
భవతరణ సాధనం!
3. మన పల్లెలన్నీ రేపల్లెలే,
సంపద అంటే పశువులే!
బాలురందరూ గోపాల బాలురే,
మువ్వగోపాలుడు నాయకుడే!
పాల ఉత్పత్తులు ,
ఇస్తాయి సమస్త శక్తులు!
వెన్న తిన్నవాడే, కొండనెత్తాడు,
మోహనవేణువూదాడు!
స్వర్గాన ఒక్క కామధేనువే,
ఇల గోవులన్నీ సత్కామాలే!
4. గోవిసర్జితాలు ,
అతి పవిత్రాలు!
యజ్ఞ యాగాదులలో,
సదా వినియోగాలు!
వ్యవసాయాన ,
రైతన్న కుడి భుజం గోవు !
గోవుకన్న,
కోడెదూడల ,శ్రమ ఫలం!
వ్యవసాయాన,
పాడిపంటల రూపం!
5. ఒట్టిపోయిన ,
గోవు నెన్నడు విక్రయించకు!
అమ్మ ముసలిదైనదని,
ఇంటి నుండి గెంటేస్తావా?
గడ్డితిని గోవు,
క్షీరామృతం ఇచ్చింది !
అమృతం తాగి ,
విషం కక్కుతావా,నరపశువా?
నీవుపశువైనా నయమే,
విషపశువు మాత్రం కామోకు!
_________
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి