సహనమే సాధనంగా
శాంతియే ఆయుధంగా
స్వేచ్ఛను ప్రసాదించెను
జాతిపిత గాంధీజీ
సమరమే నినాదంగా
సాహసం ప్రధానంగా
విజయంను సాధించే
నేతాజీ సుభాష్ బోసు
విప్లవమే జయమంటూ
జాతిని మేల్కొలుపుతూ
పరాయి పాలన పోవ
శివమెత్తెను భగత్ సింగ్
స్వరాజ్యమే జన్మహక్కు
నినాదంను ఎలుగెత్తి
ప్రజనంతా పోగుచేసే
బాలగంగాధర్ తిలక్
వందల సంస్థానాలను
దేశంలోన కలిపి
జాతిని ఏకం చేసే
సర్దార్ పటేల్ భాయి
దేశాభివృద్ధికి తన
ప్రణాళికను అమలు చేసి
ప్రగతికి బాటలు వేసెను
ఆధునిక నిర్మాత చాచాజీ
వీరు వీర నాయకులు
వీరు అమరవీరులు
వీరు త్యాగమూర్తులు
వీరు జాతి నిర్మాతలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి