ఏ మంచి పని అయినా
ఇంటినుండి మొదలవ్వాలి
పిల్లలంతా కలసిమెలసి
పరిశుభ్రత పాటించాలి
ఆహారాన్ని తినేముందు
కాళ్ళూ చేతులూ కడగాలి
వ్యక్తిగత ఆరోగ్యమే
మన ఆభరణం కావాలి
పాఠశాల విద్యార్థులు
స్వఛ్ఛగానం చేయాలి
ప్రతిపనిలోను మనమంతా
శుభ్రతకూ చోటివ్వాలి
ఇంటింటా పరిసరాలు
మొక్కలతోను నిండాలి
ఆరోగ్య ప్రదాతలుగా అవి
మన ఆయుష్షును పెంచాలి
ప్రతి ఇల్లు శుభ్రంగుంటే
గ్రామం కళకళ లాడును
గ్రామాలన్నీ శుభ్రంగుంటే
జగతి ప్రగతి సాధించును
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి