కన్నతల్లి లాంటి పొత్తం!
కల్పవల్లి లాంటి విత్తం!
ప్రగతికి అది సోపానం!
జగతికి సదా మూలధనం !
చదువరులకు భలే ఇష్టం!
సోమరులకు బహు కష్టం!
ఇష్టపడీ చదివితేను!
తొలగిపోవును అజ్ఞానం!
పెంచునులే లోకజ్ఞానం!
కలగించునులే వివేకం!
సామరస్యమునూ పెంచీ
సాధించును సమానత్వం !
పెంచును మనలో సహనం!
పంచును ఎంతో విజ్ఞానం!
సమతా మమతా నిలుపుతూ
కలిగించునులే జ్ఞానోదయం!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి