పంచాక్షరి;-ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 జీవితంలో ముక్తిని పొందాలనుకున్న ప్రతి వ్యక్తి  పంచాక్షరి నేర్చుకుని తీరవలసినదే  ఐదు అక్షరాలతో కూడిన శివ స్తుతి  ప్రపంచానికే ఆదర్శప్రాయం  శివునికి అనేక నామాలు ఉన్నాయి  శిరస్సు వంచితే శివం  తల ఎత్తితే శవం  అని మన వేద విదులు చెబుతూ ఉంటారు. అసలు శంకరుడు అంటేనే  శంకరం కరోతి కరః శంకర శుభాలను కలుగజేసేవాడు శంకరుడు ఇచ్చిన విపరీతమైన సుఖాలు  ఆస్తిపాస్తులు తనవైనప్పుడు మానవుని మస్తిష్కం ఎలా ఉంటుంది  ఒక్కసారి ఆలోచించండి. సుఖానికి అర్థం తెలియకుండా ఈ ప్రపంచంలో వున్న భోగాల కోసం తనకున్న ఆస్తిపోస్తులన్నిటిని  వాడుకుంటూ ప్రపంచంలో ఉన్న  దురలవాట్లను  తన సొంతం చేసుకుంటాడు తప్ప  మోక్ష సాధనకు ప్రయత్నం చేయటం  లేదు. అలా కాకుండా శంకర నామాన్ని  శంక మానవునికి ఉన్న  అనుమానాలన్నిటిని  ర కూకటి వేళ్ళతో పెకలించి వేసేవాడు శంకరుడు అన్న అర్థం తెలిస్తే  ఈ జీవితం నాకు ఎలా సంప్రాప్తించింది  ఈ భూమి మీద నేను ఏం చేయాలి  జీవితం ఎందుకు సమాప్తం అవుతుంది  చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెలుతున్నాం.  ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే అనే సమాధానం వస్తే   పునరపి మరణం పునరపి జననం చేయాలా  అనేకసార్లు మరణించి అనేకసార్లు మళ్లీ పుట్టవలసిన అవసరం ఏముంది అన్న విషయాలను శంకరుని ముఖతః నేర్చుకోవాలన్న కుతూహలం ఉన్నవారికి స్వామి దర్శనం చేయాలని  వారిని స్పర్శంచాలని  వారి సమాధానం వినాలని కోరిక  జనించిన క్షణం నుంచి  ముక్తి కోసం పంచాక్షరిని జపిస్తూ తపసమాధికి వెళతాడు.
పరమ పవిత్రమైన  నమశ్శివాయ మంత్రాన్ని జపిస్తూ  మనసును దాని మీదే కేంద్రీకరించి  అంకితభావంతో ఆ శంకరుని రూపం తప్ప తన మనసుకు వేరే ఏ రూపము రానివ్వక  ఆ శబ్దాన్ని స్మరిస్తూ  దానికోసం తపన పడిన ప్రతిసాధకుడు  తన అదృష్టాన్ని నెరవేర్చుకుంటాడు. భౌతికతత్వం ఎప్పుడు తనకు అర్థమవుతుందో అప్పుడు పరతత్వం కూడా తన బుద్ధికి వస్తుంది. ఆ జ్ఞానం సంపాదించిన తర్వాత దానిని సాటించడం కోసం మరికొంత సాధన చేసి  అజ్ఞానాన్ని సొంతం చేసుకున్న తర్వాత  తానే బ్రహ్మము  అహం బ్రహ్మాస్మి  నాలో ఉన్న నన్ను నేను గమనించక ఇంత కాలం  అజ్ఞానిగా మెలిగాను అన్న జ్ఞానం తెలిసిన ప్రతివాడు  మోక్ష మార్గాన్ని పొంది తీరుతాడు అని వేమన మహాశయుడు  తన అనుభవంతో చెప్పిన  ఆటవెలది పద్యాన్ని చదవండి.

"పంచ వర్ణి నెరుగా పరము నెరుంగును 
పరము నెరిగి నిచ్య   ప్రజ్వరిల్లు  
ప్రచారిల్లువాడు పరము తానవునయ్యా..."కామెంట్‌లు