దేశంలో చాలామంది దేవాలయాలకు వెళ్ళడం భగవంతుని దర్శించుకోవడం మోక్షాన్ని ప్రసాదించమని కోరుకోవడం అందరూ చేస్తున్న పనులే చాలామంది ఇంటిలో పవిత్రమైన దేవతా మూర్తి విగ్రహాన్ని ప్రత్యేక గదిలో ఉంచి ఓంకారంతో కూడిన ముగ్గు పైన ఆ స్వరూపాన్ని ప్రతిష్టించి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచి పూజిస్తూ ఉండడం నిత్యం జరుగుతున్న పని కానీ వేమన చెప్పడం పూజ అంటే బయటకు కనిపించే పనులు కాదు నిజమైన భక్తుడు భక్తిని ప్రదర్శించే పద్ధతి ఇది కాదు నీకు కావాల్సింది అక్కడ పరిశుభ్రత, పాలు, నీళ్లు, పళ్ళు, పాయసం లాంటివి ఆ విగ్రహానికి పెట్టి పూజలు చేయడం ఎందుకూ పనికిరాని ప్రక్రియ అంటారు. బుద్ధి నిలకడగా ఉంచి ఏ భగవత్ స్వరూపాన్ని నీవు మనస్ఫూర్తిగా నమ్ముతున్నావో ఆ స్వరూపానికిభక్తుడు అయి ఉంటే చాలు అంటారు.
ప్రతి మనిషి మరో మనిషికి మాట ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేస్తాడు ఈ మాట ఎక్కడి నుంచి వస్తుంది మనిషిలో ఆలోచన ప్రారంభం కావడం కుండలిని వద్దమొదలగుతుంది వెన్నుపూసల ద్వారా చిన్న మెదడు( మెడుల్లా) కు పంపితే అక్కడ వ్యర్ధ పదాలను తీసివేసి మెదడుకు అందిస్తుంది మెడుల్లా ఆ మెదడు నోటికి అందించి నాలుక ద్వారా ఆ పదాన్ని ఉచ్చరిస్తుంది కనక మనం మాట్లాడే మాట మనసులోనే స్థిరమైన రూపాన్ని ఏర్పరుచుకుని ఉంటే దిట్టమైన అభిప్రాయం మాటల ద్వారా ఇతరులకు చేరుతుంది అన్న విషయాన్ని శాస్త్రీయంగా తెలియజేస్తున్నారు వేమన భౌతికంగా జరిగే స్థితిలో మాటకన్నా కూడా మనసు స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలి అంటున్నాడు వేమన.
మతము, కులము, వర్గము, వర్ణము అన్న పదాలు మానవుడు సృష్టించినవే కానీ ఏ శరీరానికి ఆచరణలో భేదాలు లేవు తల్లి గర్భం నుంచి భూమ్మీదకి వచ్చిన ప్రతి బిడ్డకు సహజంగా జ్ఞానం ఉంటుంది దానిని విస్తృతపరచి విజ్ఞానాన్ని సంపాదించుకొని దాని ద్వారా తాను చేయదలచిన కార్యాలను నిర్ణయించుకుంటూ ఏ పనిని ఎలా చేయాలో విభజించి అలా చేయడం వలన తాను చేయవలసిన పనులను సాధించగలుగుతాడు మనిషి తన స్వయంకృషి ద్వారా దీనికి గుణం దోహదపడుతుంది తప్ప కులం కాదు తక్కువ కులం వారు ఎక్కువ కులం వారు ఒకరు బాగా ఆలోచిస్తారు ఒకరు చెడుగా ఆలోచిస్తారు అన్న వివక్ష సరి అయినది కాదు అని వేమన వాదం. సరియైన గుణము కలిగిన వారికి కులముతో పని ఏమిటి అని అనేక పద్యాల ద్వారా మనకు చెప్పారు వేమన మరి ఈ పద్యాన్ని కూడా ఒకసారి చదవండి.
"పూజ కన్న నెంచ బుద్ధినిదానంబు
మాట కన్న నెంచ మనసు దృఢము
కులము కన్న మిగుల గుణమె ప్రధానంబు..."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి