సోమయాజి తత్త్వం;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 ప్రపంచానికి మంచి చేయడానికి ప్రయత్నిస్తూ యజ్ఞం చేయించడంలో నిష్ణాతులైన వారిని  సోమయాజి అని పిలుస్తారు.  జీవితంలో నిష్టగా ఉండాలి వేద భాగాలన్నిటిని  క్షుణ్ణంగా తెలుసుకుని ఉండాలి  జీవితంలో నిష్టగా ఎలాంటి దురభ్యాసాలు లేకుండా ఉండి సమాజానికి ఆదర్శప్రాయంగా ఉన్న వ్యక్తిని  సోమయాజిగా అంగీకరిస్తారు. సోమయాజి  యజ్ఞం చేయడానికి ప్రారంభించినప్పుడు దానికి కావలసిన సరంజామా మొత్తం  నిర్వాహకులకు తెలియజేస్తారు  వాటిని అన్నింటిని సమకూర్చే భారం వారు తీసుకుంటారు. అన్ని సరుకులు వచ్చిన తరువాత  ఏ పాళ్ళలో ఏది వినియోగించదానికి  వాడాలో ఆ పదార్థాన్ని వేరువేరుగా  ఉంచుతారు. దాని తరువాత బలి పశువు కావాలి అంటాడు సోమయాజి.
ఏ రకమైన జంతువును తీసుకురావాలి  దాని పద్ధతులు ఎలా ఉండాలి అనేది సవిస్థిరంగా తెలియజేస్తాడు  మేక కనుక  ఎన్నిక అయితే  దాని బుద్ధి  మనకు వస్తుంది  మూకలో మూకగా కలిసిపోయేది గొర్రె  తాను ఏకాంతంగా ఉన్నా తనను తాను రక్షించుకోగలిగిన శక్తి కలిగినది  ఉపాయాలను  ఆలోచించగలిగినది మేక మాత్రమే  అలాంటిది  చిన్న పిల్లగా ఉండకూడదు  అలాగని ముదిరిన మేకను ఇక్కడకు తీసుకురాకూడదు. లేతగా ఉండాలి పరిశుభ్రంగా ఉండాలి  అని దాని లక్షణాలన్నిటిని చెప్తాడు.  గొల్లల వద్దకు వెళ్లి దానిని వెతికి వారు చెప్పిన పద్ధతిలో ఉన్న మేకను ఎన్నిక చేసి తీసుకొస్తారు. తరువాత దానికి  స్నానం చేయించి పసుపు కుంకుమలతో పూజ చేసి  యాగ పశువుగా నిర్ణయిస్తారు.
ఇన్ని లక్షణాలను సోమయాజి ఎందుకు చెబుతున్నాడు  తాను తినడానికి అనువుగా ఉంటుంది కనుక  ఈ యజ్ఞం చేసినందువలస సుఖాలు వస్తాయి  రంభ ఊర్వశి లాంటి వారితో  కామభోగాలను అనుభవించవచ్చు  అందుకే వేమన వారిని సోమయాజి కాదు కామయాజి అన్నాడు  కారణం  దానిని బలిపశువుగా  కాల్చి దానిని మట్టి మూకుడులో వేసి దాని ఒక్కొక్క ముక్కను సోమయాజులు మొత్తం కలిసి ఆరగిస్తారు. మొత్తం తింటే కానీ యజమానికి మోక్షం రాదు అని వారిని నమ్మిస్తారు. అమాయకులు కనక వీరు చెప్పిన ప్రతి మాట నమ్మి దానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు. యాగముతో  ప్రారంభమైన సత్కార్యం  కామయాగంతో కామ యాగంగా పూర్తి కావడం మన దురదృష్టం అని మన వేమన చెప్పిన పద్యాన్ని చదవండి.

"లంజ కొరకు మేక నంచుడు తినసాగే యజ్ఞమెల్ల కామయజ్ఞమాయే మొదట సోమయాజి తుదకు కామయాజి..."


కామెంట్‌లు