పాపం యువత;-సి.హేమలత(:లతాశ్రీ)9666779103


అప్పుడప్పుడే జీవితంలో అడుగుపెట్టే తరుణంలో
తప్పో ఒప్పో తేల్చుకోలేని సందిగ్ధంలో
కొత్త రుచులు చూడాలనే
తహతహలో
స్నేహితుల మధ్య తక్కువ 
కారాదను బలహీనతను ఆసరాగా
మలచుకొని జీవితాలు చిధ్రం
 చేయుట న్యాయమా ధూమపానం మా?

గుప్ గుప్ మంటూ మేఘమల్లే
కనులముందు నిలిచి ..
మనసును మత్తేక్కించి ..తేరుకొనేలోపు
కారుమబ్బై కమ్ముకుంటున్నావ్
కాటికి పంపి వికట్టాట్టహాసం చేస్తావ్

మిత్రుల ముందు హీరో అవ్వాలనే
బలమైన కాంక్ష తో నీలో బంధింపబడి ..
బయటపడలేక నిస్సాహాయతతో
అడుగులు తడబడి జీరోగా నిలబడి
తన వారిని నట్టేట ముంచుతున్నాడు.

క్షణమాలోచించుకో యువత!
నువ్వేప్పుడూ నాయకుడివే
కార్యదక్షత,పట్టుదల, సునిశిత
ఆలోచన నీ ఆయుధాలైనప్పుడు
క్షణికానందాలకు ప్రాముఖ్యత ఇచ్చి
బలిచేసుకోకు బ్రతుకును 
బూడిదై మిగిలి కడుపుకోత మిగల్చకు నీ జననిజనకులకు


కామెంట్‌లు
B. Aparna చెప్పారు…
Super madam 💐💐🎉🎉