కా ల చ క్ర ము శంకరప్రియ., శీల.,సంచార వాణి: 9912767098
 🙏అఖండము నైనట్టి
కాల రూపుడ వీవె!
   ఆది దేవా! భవా!
     
శ్రీసాంబ! సదాశివ
🙏కొంగ్రొత్త ఆశలను
కలిగించు చున్నావు!
     సంవత్సర కర! హర!
శ్రీ సాంబ! సదాశివ!
       ( శ్రీసాంబ సదాశివ పదాలు., శంకర ప్రియ.,)
   
👌పరమేశ్వరుడే..  కాల స్వరూపుడు! పగలు, రాత్రులు.. దినములు.. పక్షములు.. మాసములు.. ఋతువులు.. అయనములు.. సంవత్సరములు.. ఈ విధముగా కాలచక్రము; ఒకక్రమపద్దతిలో.. గిరగిరా తిరుగు చున్నది! ఇది.. ఈశ్వరుని అధీనంలో నున్నది! కనుక, కాలేశ్వరుడే.. సాంబశివుడు!
👌శ్రీశివ పరంబ్రహ్మము..
సంవత్సరమును కలిగించు చున్నాడు! కాలచక్రమును యథాశక్తిగా త్రిప్పువాడు! అందు వలన, "సంవత్సర కరో మంత్ర:! ప్రమాణం పరంతపః!" అని, గీతాచార్యుడు, శ్రీకృష్ణ పరమాత్మ; "శ్రీశివ సహస్ర రహస్య నామ స్తోత్రము"నందు ప్రస్తుతించారు!
👌కాలము.. నవ జీవన చైతన్యము! భూత, భవిష్యత్, వర్తమాన కాల స్వరూపము!
"కాల"మనగా ప్రేరేపించునది! దీనియందు సుఖ దుఃఖములు.. మున్నగునవి, కలిగించు చున్నవి!
      చాంద్రమానము, సౌరమానము, బృహస్పతి మానము.. మున్నగువాటి ప్రకారం; కాల గణనము లెక్కపెడు తున్నాము! వీటిలో.. "జనవరి" నుండి "డిసెంబరు" వరకు .."ఆంగ్ల మానము"ను అనుసరించు చున్నాము! కనుక, అందరము.. ఆంగ్ల నామ సంవత్సరము నకు "స్వాగతము" పలుకుచున్నాము! అందరికీ క్రొత్త సంవత్సరము.. ఆయు రారోగ్యములను, శాంతి దాంతులను అనుగ్రహింపుమని, వేడుకొను చున్నాము! శివమస్తు! శ్రీరస్తు!
  🚩తేటగీతి పద్యము🚩
    మనిషి మనిషిగా కొనసాగు మనసు నిమ్ము!
    మానవత్వమ్ము చూపించు మనసు నిమ్ము!
     మనుషులంత సమమను భావనము నిమ్ము!
      ఆంగ్ల వత్సరమా! నీకు స్వాగతమ్ము! 
      ( "శివలంక" డా. మీగడ రామలింగ స్వామి.,)

కామెంట్‌లు
Popular posts
సింగపూర్ లో యలమర్తి అనూరాధకు సన్మానం
చిత్రం
ఉదయం మా హృదయం...- ప్రమోద్ ఆవంచ 7013272452;
చిత్రం
తెలంగాణ సారస్వత పరిషద్ ఆద్వర్యం లో తొలి బాల సాహిత్య సమ్మేళనం
చిత్రం
దగ్గు , ఆయాసం,పిల్లి కూతలు - నివారణ ------------------------------------------------------- పిల్లల్లో జలుబు, దగ్గు, ఎక్కువైనప్పుడు ఊపిరి తిత్తుల్లోని శ్వాస మార్గాలు ముడుచుకు పోయినప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు శబ్దం వస్తే దాన్ని పిల్లి కూతలు అంటారు. దీనికి ఉబ్బసం కూడా ఒక కారణం కావచ్చు. వైరస్ బాక్టీరియా , కారణంగా శ్లేష్మపు పొరలు వాచిపోతాయి. దాని వల్ల గురక వస్తుంది కఫం వాలా జ్వరం కూడా రావచ్చు. చిటికెడు పిప్పళ్ల చూర్ణంలో తేనే వెచ్చని నీటిలో కలిపి తాగిస్తే కఫ జ్వరం తగ్గిపోతుంది పిప్పళ్ల పొడిని పాలతో కలిపి తాగిస్తే ఉబ్బసం తగ్గి పోతుంది. పిప్పళ్ల పొడితో బెల్లం కలిపి తినిపిస్తే దగ్గు, ఉబ్బసం తో పాటు రక్తహీనత కూడా నివారించ వచ్చు. - పి . కమలాకర్ రావు
చిత్రం
కళ్యాణ దంపతులు; - శంకరప్రియ., శీల., సంచారవాణి:99127 67098
చిత్రం