శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 హిందీ లో సింధు అంటే పంజాబ్ లోని ఓ నది.రెండో అర్థం సముద్రం.సంస్కృతంలోజలధార స్రోత్ నది . ఋగ్వేదంలో సింధుని నదిజలధారగాపేర్కొనటం జరిగింది.సర్పాన్ని చంపి ఏడు నదులుగా ప్రవహించే ది అని అర్ధం.కాలాంయరంలో కేవలం నదిగా ఖ్యాతి గాంచింది.అవెస్తా  ప్రాచీన ఫారశీలో హిందూ అని వాడారు.గ్రీక్ లో ఇండొస్ గా పిలవబడేది. ఋగ్వేదంలో ఒక సూక్తం లో సింధు యశోగానం చేయబడింది.దీని పేరు మీదుగా సింధు ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉంది.
లంక సింహళం సిలోన్ ఇప్పుడు శ్రీలంక కి మూలపురుషుడు సింహం నుంచి పుట్టాడు ట!?
కపిల ముని ప్రణీతమైన సాంఖ్య దర్శనం ప్రకారం ప్రకృతి పురుషుడు మూలతత్వాలు.జగత్తు ఉద్భవించింది.ప్రళయకాలంలో జగత్తు ప్రకృతిలో లీనమౌతుంది.

కామెంట్‌లు