1. శఠగోపం.-కిరీటాకారంతో భగవంతుని పాదముద్రలు కలిగింది. అర్చకులు ఆలయాల్లో భక్తుల శిరస్సుపై ఉంచుతారు. ప్రస్తుతం ఇది మోసగించడం అనే అర్థంలో జాతీయమైంది. (న మ్మాల్లవారుకు శఠకోప యతేంద్రులని పేరు.
2. సర్వమంగళం-అమంగడాన్ని పలక్కుండా ఉండటం సనాతన భారతీయ సంప్రదాయంలో భాగం. అందువల్ల అన్ని విధాల జరిగిన నష్టాన్ని సూచించేందుకు సర్వమంగళం అయింది అన్న పలుకుబడిని వ్యతిరేకార్థంలో వాడతారు.
3. సింహావలోకనం-సింహం ఆగి అటు ఇటు చూచి, ముందుకు నడుస్తుంది. దీనినే సింహాలలోకనం అంటారు. అంటే నడుస్తున్న చరిత్రను సమీక్షించుకుంటూ ముందుకు సాగటం.
సంస్కృత సూక్తులు.
1. అధికస్య అధికం ఫలం-ఎక్కువగా పూజలు చేయడం వల్ల, ఎక్కువ ఫలం కలుగుతుంది. కృషి, అభ్యాసం ఇత్యాధులను కూడా అన్వయించే మాట ఇది.
2. అనభ్యాసే విషం విద్యా, అజీర్నే భోజనం విషం-విద్యాభ్యాసం విడువకుండా చేయాలి. అభ్యాసం సన్నగిల్లితే విషప్రాయం అవుతుంది. అలాగే అజీర్ణం చేసిన తరువాత భోజనం కూడా విషం లాగా అనారోగ్యాన్ని కలిగిస్తుంది.
3. అహింసా పరమో ధర్మః-అన్ని ధర్మాలలో అహింసయే శ్రేష్టమైన ధర్మం.
సంస్కృత జాతీయాలు.;-తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి