శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 స్మశానం అంటే శీధాతువు నించి ఏర్పడింది.దాని అర్థం పడుకోవటం నిద్రించటం! ప్రాచీన కాలంలో శవాన్ని భూమి లో పాతేవారు.స్మశానం అన్నపదం వాడుకలోకి వచ్చింది.ఆర్యులు దహనం చేసేవారు.దీనివల్ల పర్యావరణ కాలుష్యము తగ్గుతుంది.భూమికొరత ఉండదు.
శౌరసేన్ రాజు పేరు మీద నేటి బ్రజమండలంకి ఆపేరు వచ్చింది.జనపదం నివాసులు అని రెండు అర్థాలు ఉన్నాయి.
శోషణ్ అంటే అనుచితంగా ఇంకోరినుంచి లాభం పొందడం! ఆంగ్లంలో ఎక్స్ ప్లాయిటేషన్ అంటారు.కానీ సంస్కృతంలో దీని అర్ధం పూర్తిగా భిన్నం.ఎండబెట్టడం నోటి తో రసం పీల్చు అనే అర్థం వస్తుంది.దుర్బలుని పుట్టి పీడించి వెట్టిచాకిరీ చేయించే అర్థం లో వాడుతున్నాం.
షేఖ్ అంటే విద్వాంసుడు.అరబ్ ప్రాం తం నుంచి వచ్చిన పుణ్యపూజనీయులను ఈపేరుతో పిలిచేవారు.హిందువు ఇస్లాం మతాన్ని స్వీకరించిన షేఖ్ అంటారు.మహ్మద్ వంశస్థులు కూడా షేక్ గా పిలువబడినారు.ముస్లింమత ఉపదేశం చేసేవారిని ఇలా పిలుస్తారు.🌹

కామెంట్‌లు